టాలీవుడ్ వెండితెరపై కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో సిద్ధార్థ్, త్రిషల జోడీ ఒకటి. 2005లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ జంట, మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత జతకట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తుండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ‘భర్తగా మారకు బ్యాచిలరూ…’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇదొక రిలేషన్-షిప్ బేస్డ్ రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది.
Also Read : Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్‌కు తొలి ఆహ్వానం!
అది కూడా ఒక కొత్త దర్శకుడు ఈ కథను సిద్ధం చేశారని, పెళ్లి తర్వాత దంపతుల మధ్య జరిగే సరదా సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. ఇందులో సిద్ధార్థ్-త్రిషలతో పాటు మరో యువ జంట కూడా ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధార్థ్‌తో ‘బొమ్మరిల్లు’ వంటి ఆల్‌టైమ్ క్లాసిక్ తీసిన దిల్ రాజు, ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం విదేశాల్లోనే సాగేలా భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న త్రిష, ఇప్పుడు తన పాత మిత్రుడు సిద్ధార్థ్‌తో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.




