17
October, 2026

A News 365Times Venture

17
Saturday
October, 2026

A News 365Times Venture

YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!

Date:

YSRCP 2nd Candidates List: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మొదటి లిస్ట్‌లో అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP).. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లు, పది మున్సిపాలిటీలు, ఏడు నగర పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లతో పాటు వారి సామాజిక వర్గాలు, ఆయా స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను వెల్లడించింది.

మున్సిపల్‌ కార్పొరేషన్లకు అభ్యర్థులు వీరే
వైసీపీ ప్రకటించిన రెండో విడత జాబితాలో విజయవాడ కార్పొరేషన్‌ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మిని ఎంపిక చేసింది. ఆమె నగరాలు సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ఈ స్థానం జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. గుంటూరు కార్పొరేషన్‌ అభ్యర్థిగా తాడికొండ అలివేలు వెంకట నాగపద్మ శ్రీదేవిని ప్రకటించింది. ఆమె వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ఈ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. తిరుపతి కార్పొరేషన్‌ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఏచం వాసుదేవ యాదవ్‌ను వైసీపీ ఎంపిక చేసింది. ఈ స్థానం జనరల్‌ కేటగిరీలో ఉంది. కర్నూలు కార్పొరేషన్‌ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఊతకళ్ల సుశీలను ప్రకటించింది. ఈ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది. అనంతపురం కార్పొరేషన్‌ అభ్యర్థిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన చిట్లూరు రమేష్‌ గౌడ్‌ను ఎంపిక చేయగా, ఈ స్థానం బీసీ కేటగిరీలో ఉంది. చిత్తూరు కార్పొరేషన్‌ అభ్యర్థిగా వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రామస్వామి చంద్రశేఖర్‌ను ప్రకటించింది. ఈ స్థానం కూడా బీసీ కేటగిరీకి కేటాయించారు.

పది మున్సిపాలిటీలకు అభ్యర్థుల ప్రకటన
మున్సిపాలిటీలకు సంబంధించి బొబ్బిలి అభ్యర్థిగా తెలగ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల అచ్యుతవల్లిని వైసీపీ ప్రకటించింది. ఈ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. సాలూరు మున్సిపాలిటీ అభ్యర్థిగా గాజులకాపు సామాజిక వర్గానికి చెందిన బావిరెడ్డి రిబికా రాణిని ఎంపిక చేసింది. ఈ స్థానం బీసీ మహిళకు కేటాయించారు. అమలాపురం మున్సిపాలిటీ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన దూడల వీరితా దేవిని ప్రకటించింది. ఈ స్థానం జనరల్‌ కేటగిరీలో ఉంది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అభ్యర్థిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన మేకా సత్యవతిని ఎంపిక చేయగా, ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. నూజివీడు మున్సిపాలిటీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన కంచర్ల లవకుమార్‌ను ప్రకటించింది. ఈ స్థానం ఎస్సీ కేటగిరీలో ఉంది.

ఇక, జగ్గయ్యపేట మున్సిపాలిటీ అభ్యర్థిగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షేక్‌ హఫీజున్నీసాను వైసీపీ ఎంపిక చేసింది. ఈ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. పెడన మున్సిపాలిటీ అభ్యర్థిగా దేవాంగ సామాజిక వర్గానికి చెందిన కాటకం నాగకుమారిని ప్రకటించింది. ఈ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించారు. నాయుడుపేట మున్సిపాలిటీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మను ఎంపిక చేసింది. ఈ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. సూళ్లూరుపేట మున్సిపాలిటీ అభ్యర్థిగా మాల సామాజిక వర్గానికి చెందిన మోదీ విమల కుమార్‌ను ప్రకటించింది. ఈ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ అభ్యర్థిగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కోడిగంటి శివన్న రఘును వైసీపీ ఎంపిక చేసింది. ఈ స్థానం జనరల్‌ కేటగిరీలో ఉంది.

ఏడు నగర పంచాయతీలకు అభ్యర్థుల ఖరారు
నగర పంచాయతీల్లో పాలకొండ అభ్యర్థిగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన పాలవలస ఇందుమతిని వైసీపీ ప్రకటించింది. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ముమ్మిడివరం నగర పంచాయతీ అభ్యర్థిగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సానబోయిన సునీలాదేవిని ఎంపిక చేసింది. ఈ స్థానం కూడా బీసీ మహిళకు కేటాయించారు. నందిగామ నగర పంచాయతీ అభ్యర్థిగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన చల్లా బ్రహ్మేశ్వరరావును ప్రకటించింది. ఈ స్థానం జనరల్‌ కేటగిరీలో ఉంది. గిద్దలూరు నగర పంచాయతీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమా నరసింహారెడ్డిని ఎంపిక చేసింది. అద్దంకి నగర పంచాయతీ అభ్యర్థిగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఉడత్తు సురేష్‌ను ప్రకటించింది. చీమకుర్తి నగర పంచాయతీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మేడగం శ్రీదేవిని వైసీపీ ఎంపిక చేసింది. దర్శి నగర పంచాయతీ అభ్యర్థిగా అదే సామాజిక వర్గానికి చెందిన వెన్నపూస వెంకటరెడ్డిని ప్రకటించింది. ఈ మూడు స్థానాలూ జనరల్‌ కేటగిరీలో ఉన్నాయి.

స్థానిక ఎన్నికలపై వైసీపీ కసరత్తు
రెండో విడత జాబితా ద్వారా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వైసీపీ వెల్లడించింది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాలు, రిజర్వేషన్లకు అనుగుణంగా పేర్లను ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ తన అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల సన్నద్ధతను కొనసాగిస్తోంది.

 

Whatsapp Image 2026 10 16 At 10.26.35 Pm

 

Whatsapp Image 2026 10 16 At 10.26.51 Pm

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?

Story Board: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ అయింది....

Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..

Delhi Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) శుక్రవారం ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది....

AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్

AP High Court: స్థానిక సంస్థల వేళ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో...

AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..

AP Government: భవన యజమానులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మున్సిపాలిటీ...