17
October, 2026

A News 365Times Venture

17
Saturday
October, 2026

A News 365Times Venture

Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?

Date:

Off The Record: విజయనగరం టీడీపీ మేయర్‌ అభ్యర్థి ఎంపిక వ్యవహారం పార్టీలో అంతర్గత రాజకీయాలకు అద్దం పడుతోందన్న చర్చ సాగుతోంది. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన నేతలు.. కేడర్‌ను సమన్వయం చేసుకున్న నాయకులు.. తమకు తగిన గుర్తింపు దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం వినిపిస్తోంది. మొదటి నుంచి కొందరికే ప్రాధాన్యం ఇస్తూ.. సీనియర్లను పక్కన పెట్టారన్న ఆరోపణలు కూడా పార్టీ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత నాయకుల మధ్య సమన్వయం పెరగాల్సింది పోయి.. విభేదాలు పెరుగుతున్నాయట. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమని కొందరు సీనియర్లు భావిస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు దక్కలేదని.. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉన్న నేతలను కూడా పక్కన పెట్టారన్న అసంతృప్తి వ్యక్తమవుతోందట. తండ్రి రాజకీయ అనుభవంతో పోల్చుతూ.. ప్రస్తుత నాయకత్వ వ్యవహారశైలిపై కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారన్న ప్రచారం కూడా వినిపిస్తోంది.

ఇప్పుడు మేయర్‌ అభ్యర్థి ఎంపిక కీలక పరీక్షగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎవరిని ఎంపిక చేసినా మరో వర్గం అసంతృప్తికి గురయ్యే పరిస్థితి ఉందన్న చర్చ సాగుతోంది. గెలుపు అవకాశాలు ఉన్న నాయకులను పక్కనపెట్టి.. పరిమిత రాజకీయ బలం ఉన్నవారిని ముందుకు తెచ్చారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయట. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన చిన్న శ్రీనుకు ప్రాధాన్యం పెరుగుతోందన్న ప్రచారం పార్టీలో కొత్త సమీకరణాలకు తెరతీస్తోందని అంటున్నారు. మేయర్‌ అభ్యర్థి రేసులో చిన్న శ్రీను కుమార్తె పేరు బలంగా వినిపిస్తుండటంతో.. ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారిందన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా పరిస్థితులను అంచనా వేసుకుంటూ.. ఎవరికి మద్దతివ్వాలి..? ఎవరిని బరిలోకి దించాలి..? అన్న అంశాలపై తర్జనభర్జన పడుతోందన్న ప్రచారం నడుస్తోంది. ఒకవైపు పార్టీ సీనియర్ల అసంతృప్తి.. మరోవైపు కొత్తగా చేరిన నేతలకు ప్రాధాన్యం.. ఇంకోవైపు మేయర్‌ పీఠం గెలుపు లక్ష్యం.. ఈ మూడు అంశాల మధ్య ఎమ్మెల్యే నిర్ణయం కీలకంగా మారిందట.

ఇక రిజర్వేషన్ల అంశం కూడా రాజకీయ సమీకరణాల్లో ప్రధాన చర్చగా మారింది. మేయర్‌ పదవి రిజర్వేషన్‌ విషయంలో ముందుగానే స్పష్టమైన వ్యూహంతో వ్యవహరించి ఉంటే.. ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని కొందరు పార్టీ నాయకులు భావిస్తున్నారట. బీసీ మహిళకు అవకాశం ఉండేలా వ్యూహం రూపొందించి ఉంటే.. అభ్యర్థి ఎంపికపై ఇంతటి అంతర్గత ఒత్తిడి ఉండేది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయట. అయితే ప్రస్తుత రిజర్వేషన్‌ ప్రకారం జనరల్‌ మహిళకు అవకాశం ఉండటంతో.. ఆశావహుల ఎంపికలో సమీకరణాలు మారిపోయాయని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. రిజర్వేషన్‌ మార్పులపై ముందుగానే అంచనా వేయలేకపోయారా..? లేక అందుబాటులో ఉన్న రాజకీయ అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోయారా..? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మేయర్‌ అభ్యర్థి ఎంపికలో తప్పటడుగు పడితే.. దాని ప్రభావం కేవలం నగర రాజకీయాలకే పరిమితం కాకుండా ఎమ్మెల్యే నాయకత్వంపైనా పడే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గెలిస్తే తమ వ్యూహమే పనిచేసిందని ఒక వర్గం చెప్పుకునే అవకాశం.. ఓడిపోతే పార్టీ నాయకత్వం ముందు బాధ్యత ఎవరిదన్న ప్రశ్న తలెత్తే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి విజయనగరం టీడీపీలో మేయర్‌ పీఠం ఇప్పుడు కేవలం పోటీగా మిగలడం లేదు. పార్టీపై ఎవరికి పట్టు ఉంది..? కేడర్‌ ఎవరి వెంట ఉంది..? సీనియర్లను కలుపుకొని వెళ్లే సామర్థ్యం ఎవరికి ఉంది..? అధిష్ఠానం ఎవరికి ప్రాధాన్యం ఇస్తోంది..? అన్న అంశాలకు ఈ ఎంపిక పరీక్షగా మారుతోందన్న చర్చ సాగుతోంది.

మొదట్లోనే అసంతృప్తిని చక్కదిద్దాల్సిందని.. ఇప్పుడు పరిస్థితి చేయి దాటే వరకు వచ్చిందని కొందరు నేతలు చెప్పుకుంటున్నారట. మేయర్‌ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఒక అంశమైతే.. ఆ ఎంపిక తర్వాత విజయనగరం టీడీపీలో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్నది మరో కీలక అంశం. అందుకే ఇప్పుడు మేయర్‌ అభ్యర్థి ఎంపికపైనే కాదు.. ఆ నిర్ణయం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపైనా ఆసక్తి నెలకొంది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..

Pakistan: విదేశీ రుణాలు, సౌదీ డబ్బులు, అమెరికా డాలర్లపై ఆధారపడే పాకిస్తాన్,...

Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..

తెలంగాణలో నూతన బార్ల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది....

Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!

Bhindi Health Benefits: బెండకాయ ఇష్టమే అయినా.. అందులోని జిగురు అంటే...

Instant Noodle: ఇన్‌స్టంట్ నూడుల్స్‌ తినడంలో భారత్‌ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..

Instant Noodle: ఇప్పుడు అంతా ఇన్‌స్టంట్‌ ఫుడ్‌కు అలవాటు పడిపోతున్నారు.. మరీ...