20
October, 2026

A News 365Times Venture

20
Tuesday
October, 2026

A News 365Times Venture

WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్ను ఉపయోగించారా.?

Date:

WhatsApp Useful Features: వాట్సాప్‌ను చాలామంది కుటుంబ సభ్యులు,స్నేహితులు, ఉద్యోగరీత్యా చాట్ చేయడానికి, ఫొటోలు, వీడియోలు పంపడానికి, ఇంకా వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. అయితే ఇందులో ప్రైవసీని మెరుగుపరచడంతో పాటు మెసేజ్‌లను సులభంగా నిర్వహించేందుకు ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయని చాలామందికి తెలియదు కూడా.. అవునండి.. చాలామందికి రోజువారీ వినియోగానికి ఉపయోగపడే ఫీచర్ల గురించి అవగహన లేదు. కాబట్టి అవేవో చూద్దామా..

మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్..

ఎప్పటికీ చాట్‌లో ఉండకూడదనుకునే మెసేజ్‌ల కోసం “Disappearing Messages” అనే ఫీచర్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మెసేజ్‌లు 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా తొలగిపోయేలా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత చాట్ ఓపెన్ చేసి కాంటాక్ట్ లేదా గ్రూప్ పేరుపై ట్యాప్ చేసి “Disappearing Messages” ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

చాట్‌లకు లాక్

వ్యక్తిగత లేదా సున్నితమైన సంభాషణలను ఇతరుల కంటపడకుండా ఉంచేందుకు “Chat Lock” ఫీచర్ ఉపయోగించవచ్చు. సంబంధిత చాట్‌లో కాంటాక్ట్ లేదా గ్రూప్ పేరుపై ట్యాప్ చేసి “Chat Lock” ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఫోన్, యాప్ వెర్షన్‌ను బట్టి ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ వంటి భద్రతా ఆప్షన్లతో చాట్‌ను లాక్ చేయవచ్చు.

పంపిన మెసేజ్‌ను ఎడిట్

టైపింగ్ తప్పులు లేదా మిస్ అయిన సమాచారాన్ని సరిచేయడానికి మెసేజ్‌ను డిలీట్ చేసి మళ్లీ పంపాల్సిన అవసరం లేదు. పంపిన మెసేజ్‌పై ఎక్కువసేపు ప్రెస్ చేసి “Edit” ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఎడిట్ చేసిన తర్వాత అవతలి వ్యక్తికి మెసేజ్‌పై Edited అని కనిపిస్తుంది. అయితే ఒరిజినల్ మెసేజ్ ఏమిటో వారు చూడలేరు. ఈ ఫీచర్ మెసేజ్ పంపిన తర్వాత పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఆన్‌లైన్ స్టేటస్ దాచడం

మీరు వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్న విషయం లేదా చివరిసారి యాప్ ఉపయోగించిన సమయం ప్రతి ఒక్కరికీ కనిపించకూడదనుకుంటే ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. Settings > Privacy > Last seen and onlineలోకి వెళ్లి My contacts except… ఆప్షన్ ద్వారా ఎంచుకున్న వ్యక్తుల నుంచి ఈ సమాచారాన్ని దాచుకోవచ్చు.

ముఖ్యమైన మెసేజ్‌లను పిన్ చేయడం

గ్రూప్ చాట్‌లో చిరునామా, మీటింగ్, సమయం లేదా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని పదేపదే వెతకాల్సిన అవసరం లేకుండా “Pin” ఫీచర్ ఉపయోగించవచ్చు. కావాల్సిన మెసేజ్‌పై ఎక్కువసేపు ప్రెస్ చేసి ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఒక చాట్‌లో గరిష్ఠంగా మూడు మెసేజ్‌లను పిన్ చేయవచ్చు. వీటిని 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల పాటు పిన్ చేసి ఉంచుకోవచ్చు.

ప్రత్యేక నోటిఫికేషన్ సౌండ్

వాట్సాప్‌లో ఎవరి నుంచి మెసేజ్ వచ్చిందో ఫోన్ చూడకుండానే తెలుసుకోవాలంటే ఒక్కో కాంటాక్ట్ లేదా గ్రూప్‌కు వేర్వేరు “Notification Tone” సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత చాట్ ఓపెన్ చేసి, పైభాగంలోని పేరు మీద ట్యాప్ చేసి Notifications లేదా Notification tone ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ నచ్చిన సౌండ్‌ను ఎంచుకోవచ్చు. ఇదే విభాగం నుంచి అవసరమైన చాట్‌ను మ్యూట్ కూడా చేయవచ్చు.

మీకే మీరే మెసేజ్ పంపుకోవచ్చు

వాట్సాప్‌ను వ్యక్తిగత నోట్స్, రిమైండర్లు, లింకులు లేదా షాపింగ్ లిస్ట్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. కొత్త చాట్‌ను ప్రారంభించి మీ పేరు లేదా ఫోన్ నంబర్‌తో ఉన్న మీ కాంటాక్ట్‌ను ఎంచుకుని మీకే మెసేజ్ పంపుకోవచ్చు. ఫొటోలు, లింకులు, వాయిస్ నోట్స్, ముఖ్యమైన సమాచారం ఇలా ఒకే చోట సేవ్ చేసుకోవడం ద్వారా అవసరమైనప్పుడు సులభంగా చూసుకోవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..

Sai Kishore Hat-Trick: రంజీ ట్రోఫీ 2026-27లో తమిళనాడు స్పిన్నర్ సాయి...

Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!

Chinmay Sutar: రంజీ ట్రోఫీ 2026-27 రెండో రౌండ్‌లో మిజోరం బ్యాటర్...

WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!

WPL 2027 Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు...