Sai Kishore Hat-Trick: రంజీ ట్రోఫీ 2026-27లో తమిళనాడు స్పిన్నర్ సాయి కిషోర్ అదరగొట్టాడు. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 43వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో ఉత్తరాఖండ్ 45.4 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లోనూ సాయి కిషోర్ 18 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో మ్యాచ్‌లో మొత్తంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
మరోవైపు అజిత్ రామ్ 33 పరుగులకు 4 వికెట్లు పడగొట్టడంతో తమిళనాడు ఇన్నింగ్స్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ హ్యాట్రిక్‌తో సాయి కిషోర్ ప్రత్యేక జాబితాలో చేరాడు. రణజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున హ్యాట్రిక్ తీసిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో బీఎస్ కళ్యాణసుందరం, భారత్ అరుణ్, సునీల్ సుబ్రమణ్యం, దామోదరన్ దేవానంద్, రామకృష్ణన్ రామకుమార్, ఎం. మహ్మద్, గుర్జప్నీత్ సింగ్ తర్వాత సాయి కిషోర్ చేరాడు. అయితే సాయి కిషోర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కలేదు. తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగుల శతకంతో మెరిసిన ప్రదోష్ రంజన్ పాల్‌ను ఈ అవార్డు వరించింది.




