1
May, 2026

A News 365Times Venture

1
Friday
May, 2026

A News 365Times Venture

Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..

Date:

Weather Updates in Regional Languages: రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. వాతావరణ సమాచారాన్ని ఇకపై ప్రాంతీయ భాషల్లో అందించే సరికొత్త సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వ్యవసాయ రంగానికి మరింత సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, చాట్ జీపీటీ తరహాలో పనిచేసే ‘మౌసమ్ వాణి’ అనే ప్రత్యేక అప్లికేషన్‌ను Indian Institute of Tropical Meteorology (IITM) అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన వాతావరణ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా, ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల రైతులకు ఇది మరింత ఉపయోగకరంగా మారనుంది.

Read Also: M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

ప్రారంభ దశలో ఈ సేవను హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అనంతరం దశలవారీగా తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషలకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు తమ స్థానిక భాషలోనే వాతావరణ వివరాలు పొందగలుగుతారు. ఈ అప్లికేషన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం స్మార్ట్‌ఫోన్లకే పరిమితం కాకుండా సాధారణ బేసిక్ మొబైల్ ఫోన్లలో కూడా పనిచేసేలా రూపుదిద్దుకుంది. దీంతో ప్రతి రైతుకూ ఈ సౌకర్యం చేరే అవకాశం ఉంది. ‘నౌకాస్ట్’ మరియు రియల్‌టైమ్ వాతావరణ సమాచారాన్ని కేవలం కొన్ని సెకన్లలోనే పొందగలుగుతారు. ఈ వినూత్న సేవను త్వరలోనే కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం వల్ల రైతులు ముందస్తు వాతావరణ సమాచారం ఆధారంగా తమ వ్యవసాయ పనులను సక్రమంగా ప్రణాళిక చేసుకోవడానికి పెద్ద మద్దతు లభించనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!

KTR : ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక ఆశలు చూపి, అధికారంలోకి...

Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!

Ambati Rambabu: నంద్యాలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ప్రభుత్వంపై...

Top Selling CNG Cars: భారత్‌లో అత్యధికంగా సేల్‌ అయిన CNG కార్లు ఇవే..

Top Selling CNG Cars: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో CNG కార్లకు...

Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!

Petrol, Diesel Price: దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు గణనీయంగా పెరిగాయి....