1
May, 2026

A News 365Times Venture

1
Friday
May, 2026

A News 365Times Venture

Top Selling CNG Cars: భారత్‌లో అత్యధికంగా సేల్‌ అయిన CNG కార్లు ఇవే..

Date:

Top Selling CNG Cars: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో CNG కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, తక్కువ ఖర్చుతో ప్రయాణం కోసం ఎక్కువ మంది వినియోగదారులు CNG వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే, దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 CNG కార్ల జాబితా స్పష్టమవుతుంది.

CNG కార్లు ఇలా సేల్‌ అయ్యాయి..
* మొదటి స్థానంలో Maruti Suzuki Ertiga నిలిచింది. FY2026లో ఈ కారు 1,45,480 యూనిట్లు అమ్ముడై 14.3 శాతం మార్కెట్ వాటాను సాధించింది. విశాలమైన స్థలం, తక్కువ నిర్వహణ ఖర్చులు ఉండటం వల్ల ఇది కుటుంబాల కోసం అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది.

* రెండవ స్థానంలో Maruti Suzuki Dzire ఉంది. ఈ కారు 1,35,330 యూనిట్లు అమ్ముడై 13.3 శాతం మార్కెట్ వాటాను సంపాదించింది. ముఖ్యంగా మార్చి 2026లో ఇది అత్యధికంగా అమ్ముడైన కారు కావడం విశేషం.

* మూడవ స్థానంలో Maruti Suzuki Wagon R ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు 96,381 యూనిట్లు అమ్ముడై 9.5 శాతం మార్కెట్ వాటాను పొందింది. సరసమైన ధరలో అందుబాటులో ఉండటం వల్ల ఇది ప్రజల్లో మంచి ఆదరణ పొందుతోంది.

* Maruti Suzuki Brezza 71,329 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలిచింది

* ఐదో స్థానంలో Tata Nexon 69,168 యూనిట్లతో ఉంది..

* ఆరవ స్థానంలో Tata Punch (67,468 యూనిట్లు)

* ఏడవ స్థానంలో Maruti Suzuki Eeco (66,675 యూనిట్లు) ఉన్నాయి. ఈకో ఈ జాబితాలో ఉన్న ఏకైక వ్యాన్ కావడం విశేషం.

* ఎనిమిదో స్థానంలో Hyundai Aura (62,612 యూనిట్లు)

* తొమ్మిదో స్థానంలో Maruti Suzuki Fronx (54,805 యూనిట్లు)

* పదో స్థానంలో Maruti Suzuki Celerio (35,677 యూనిట్లు) ఉన్నాయి.

ఈ గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశంలో CNG కార్ల మార్కెట్‌లో Maruti Suzuki స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. టాప్ 10లో ఎక్కువ భాగం మారుతి కార్లే ఉండటం, అలాగే మొత్తం మార్కెట్‌లో సగానికి పైగా వాటా కలిగి ఉండటం దీని ప్రజాదరణను స్పష్టంగా తెలియజేస్తోంది. అంతే కాదు.. టాప్ 5లో నాలుగు కార్లు మారుతి సుజుకి కంపెనీకి చెందినవే కావడం గమనార్హం. మొత్తానికి, మీరు CNG కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ జాబితా మీకు సరైన ఎంపిక చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. ధర, మైలేజ్, నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని మీ అవసరాలకు తగిన కారు ఎంచుకోవడం మంచిది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!

Petrol, Diesel Price: దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు గణనీయంగా పెరిగాయి....

West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర దీదీ ధర్నా..

West Bengal Elections 2026: వెస్ట్ బెంగాల్‌లో ఇటీవల పోలింగ్ ముగిసిన...

AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..

AP Weather Alert: రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని...

West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..

West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాతి రోజే హైడ్రామా...