15
November, 2026

A News 365Times Venture

15
Sunday
November, 2026

A News 365Times Venture

UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..

Date:

UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తాజాగా జరిగిన ఒక సర్వే కీలక విషయాలను వెల్లడించింది. ఓట్ వైబ్(Vote Vibe) నిర్వహించిన ఈ సర్వేలో ఓటర్ల అభిప్రాయాలు వెల్లడయ్యాయి. 41.9 శాతం మంది బీజేపీ కూటమికి ఓటు వేయాలనే అభిప్రాయాన్ని వెల్లడించగా, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ(ఎస్పీ)-కాంగ్రెస్ కూటమికి 39.1 శాతం మంది మద్దతు ప్రకటించినట్లు సర్వే వెల్లడించింది. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్‌కు అందనంత స్థానంలో ఉన్నారు. యోగికి 44.1 శాతం మంది మద్దతు ఇవ్వగా, అఖిలేష్‌కు 34.5 శాతం, ప్రియాంకాగాంధీకి 6.5 శాతం, మాయావతికి 5.8 శాతం మంది మద్దతు తెలిపారు.

అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఏ పార్టీకి ప్రజల మద్దతు ఎక్కువగా ఉందని భావిస్తున్నారని అడిగినప్పుడు 42.2 శాతం మంది ఎస్పీ ముందుందని, 41.2 శాతం మంది బీజేపీ ముందుందని అభిప్రాయపడ్డారు. అంటే ఓటు వేయాలనే ఉద్దేశం, ఇతరుల రాజకీయ మద్దతుపై ప్రజల అంచనా రెండింటిలో వేర్వేరు ధోరణులు కనిపించాయి.

ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం..

ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ పనితీరుపై 41.3 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 38.2 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాలు ఎమ్మెల్యేల పనితీరుపై సంతృప్తితో ఉన్నవారు 23.6 శాతం మంది మాత్రమే. మరోవైపు, 50.2 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు వెల్లడైంది. దీనిని బట్టి చూస్తే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక గెలుపోటములపై స్పష్టమైన ప్రభావం చూపిస్తాయని సర్వే తేల్చింది.

నిరుద్యోగంపై ఆందోళన..

ఎక్కువ మంది ఓటర్లు నిరుద్యోగం ప్రధాన సమస్య అని చెప్పారు. 26.5 శాతం మంది నిరుద్యోగమే అసలు సమస్య అని వెలల్డించారు. 16.3 శాతం మంది ద్రవ్యోల్బణం, 11.3 శాతం మంది రైతు సమస్యలు, 9.9 శాతం మంది శాంతిభద్రత సమస్యలు, విద్య వైద్యంపై 8.9 శాతం, రామ మందిర విరాళాల వివాదంపై 8 శాతం మంది సమస్యలుగా చెప్పారు. విపక్షాలు లేవనెత్తుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రధాన ఎన్నికల అంశంగా చెప్పిన వారు 3.6 శాతం మాత్రమే.

ప్రాంతాల వారీగా ఎవరికి మద్దతు..

పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. గ్రామాల్లో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ తప్పదని సర్వే చెబుతోంది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీకి, అవధ్ ప్రాంతంలో ఎస్పీకి మద్దతు ఉన్నట్లు సర్వేలో తేలింది. పూర్వాంచల్, బుంధేల్ ఖండ్ ప్రాంతాల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ ఉంటుందని చెప్పింది.

కులాల వారీగా ఎవరికి మద్దతు..

కులాల వారీగా ఓటర్ల అభిప్రాయాలను పరిశీలిస్తే యాదవ ఓటర్లలో సమాజ్‌వాదీకి మద్దతు ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది. యాదవేతర ఓబీసీ వర్గాల్లో బీజేపీకి మద్దతు కనిపించింది. జాటవేతర ఎస్సీల్లో బీజేపీకి, జాటవ ఓటర్లలో మాయవతి బీఎస్పీకి మద్దతు కనిపించింది. అగ్రవర్ణ ఓటర్లలో బీజేపీకి 66 శాతం మద్దతు ఉంది, ముస్లిం ఓటర్లలో 63 శాతం మంది ఎస్పీ వైపు నిలుస్తున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!

Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాజిరంగ సమీపంలో కంటైనర్...

Delimitation Bill: మహిళా కోటా కోసం డీలిమిటేషన్ బిల్లు.. 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం ధీమా!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్ బిల్లు), మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తు...

TG TET: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం...

Jharkhand: 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు

Jharkhand: జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భూషణ్ బారాపై 14 ఏళ్ల గిరిజన...