15
November, 2026

A News 365Times Venture

15
Sunday
November, 2026

A News 365Times Venture

TG TET: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..

Date:

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ నేడు అధికారికంగా టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన లక్షలాది మంది అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది.

విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది అంటే 2027 జనవరి 3వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. పారదర్శకత కోసం ఈ పరీక్షలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానంలో, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ నవంబర్ 16వ తేదీ నుంచి విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 16 నుంచి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 10వ తేదీతో ముగియనుంది. చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.

పరీక్షకు సంబంధించిన విద్యార్హతలు, పేపర్-1, పేపర్-2 సిలబస్ వివరాలు, దరఖాస్తు రుసుము, పరీక్షా కేంద్రాల వంటి సమగ్ర సమాచారం కోసం అభ్యర్థులు https://schooledu.telangana.gov.in  వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లోని నిబంధనలను క్షుణ్ణంగా చదివిన తర్వాతే అప్లై చేయాలని, గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి పరీక్షలకు సిద్ధం కావాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ అభ్యర్థులకు సూచించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!

Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాజిరంగ సమీపంలో కంటైనర్...

UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..

UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తాజాగా...

Delimitation Bill: మహిళా కోటా కోసం డీలిమిటేషన్ బిల్లు.. 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం ధీమా!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్ బిల్లు), మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తు...

Jharkhand: 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు

Jharkhand: జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భూషణ్ బారాపై 14 ఏళ్ల గిరిజన...