15
November, 2026

A News 365Times Venture

15
Sunday
November, 2026

A News 365Times Venture

Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు..

Date:

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త అందించింది. చేనేత రంగానికి ఊతమిస్తూ, పేద మహిళలకు నాణ్యమైన చీరలను ఉచితంగా అందించే ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని, ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఈ పంపిణీ ప్రక్రియను లాంఛనంగా మొదలుపెట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన సుమారు 95 లక్షల మంది ఆడపడుచులకు వారం రోజుల్లోనే ఈ చీరలను చేరవేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.334 కోట్ల నిధులను వెచ్చించింది. గతంలో పంపిణీ చేసిన సాధారణ చీరలకు భిన్నంగా, ఈసారి పండుగలు, శుభకార్యాలకు సైతం కట్టుకునేంత ఆకర్షణీయంగా వీటిని తీర్చిదిద్దారు. చిలుకపచ్చ రంగుపై ఎర్రటి పట్టు, జరీ అంచుతో కూడిన ఈ చీరలు చూడముచ్చటగా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల సహా రాష్ట్రంలోని 163 ఉత్పత్తి కేంద్రాల్లో ఏప్రిల్ మాసం నుంచే నేతన్నలు వీటిని తయారు చేశారు. రెండు నెలల క్రితమే ఉత్పత్తి పూర్తి కాగా, ప్రస్తుతం జిల్లా, మండల స్థాయి గోదాములకు చీరలను చేరవేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

గతంలో చీరల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న విమర్శల నేపథ్యంలో, ఈసారి ప్రభుత్వం కట్టుదిట్టమైన సాంకేతిక నిఘా ఏర్పాటు చేసింది. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ జరగనుంది. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డును చూపించడంతో పాటు, చీర తీసుకునే సమయంలో ప్రత్యేక మొబైల్ యాప్‌లో వారి ఫొటోను అప్‌లోడ్ చేస్తారు. ఈ డిజిటల్ ధ్రువీకరణ వల్ల బోగస్ లెక్కలకు అడ్డుకట్ట పడటంతో పాటు, ప్రతి అర్హురాలికి కచ్చితంగా చీర అందేలా పారదర్శకతను పాటిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!

Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాజిరంగ సమీపంలో కంటైనర్...

UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..

UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తాజాగా...

Delimitation Bill: మహిళా కోటా కోసం డీలిమిటేషన్ బిల్లు.. 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం ధీమా!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్ బిల్లు), మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తు...

TG TET: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం...