24
October, 2026

A News 365Times Venture

24
Saturday
October, 2026

A News 365Times Venture

Uma Kashvi: ఫీల్డింగ్ టైమ్‌లో మైదానంలో కొండముచ్చు హల్చల్.. తరువాత ఏం జరిగిందంటే..?

Date:

Uma Kashvi: మహిళల అండర్-19 టీ20 ట్రోఫీ ఎలైట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో కర్ణాటక, విదర్భ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయాన, బౌండరీ లైన్ వద్ద ఉన్నట్టుండి ఓ కొండముచ్చు (లంగూర్) హల్చల్ చేసింది. అటుగా ఫీల్డింగ్ చేస్తున్న విదర్భ జట్టు ఆటగాడైన ఉమా కాశ్వి వైపు అది దూసుకొచ్చింది. తన వైపునకు కోపంగా వస్తున్న కొండముచ్చును చూసి ఒక్కసారిగా కంగారుపడిన ఉమ, పక్కకు తప్పుకోబోయి మైదానంలోనే కిందపడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ కొండముచ్చు ఆమెకు ఎలాంటి హాని చేయకుండానే వేగంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత తేరుకున్న ఉమ వెంటనే లేచి నిలబడటంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. కర్ణాటక జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన విదర్భ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ, 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కేవలం ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో కర్ణాటక జట్టు టోర్నమెంట్‌లో తదుపరి దశకు అర్హత సాధించినప్పటికీ, ఈ కోర్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మాత్రం మైదానంలో జరిగిన కోతి హడావుడి వలనే అందరికీ గుర్తుండిపోయింది.

ఈ ఘటనతో వార్తల్లో నిలిచిన ఉమా కాశ్వి భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్‌లో పెద్ద స్టార్‌గా ఎదుగుతుందని అంతా భావిస్తున్నారు. ఒత్తిడిలోనూ కూల్ఫ్‌గా ఉండటం, అగ్రెసివ్ ఆల్-రౌండ్ స్కిల్స్ ఆమెను ప్రత్యేకంగా నిలబెడతాయి. డేంజరస్ ఆఫ్-స్పిన్ బౌలింగ్ తో పాటు కింది వరుసలో మెరుపు బ్యాటింగ్ చేయడంలో ఆమె దిట్ట. కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్‌లో తన ప్రయాణం మొదలుపెట్టిన ఉమ, కేవలం 12 ఏళ్ల వయసులోనే జూనియర్ క్లబ్ స్థాయి ఇంటర్-స్కూల్ టోర్నమెంట్‌లో డబుల్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి కర్ణాటక అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ రాణిస్తోంది.

గత జూన్, జూలై నెలల్లో శ్రీలంకలో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత మహిళల అండర్-19 జట్టులోనూ ఆమె స్థానం దక్కించుకుంది. ఆ టూర్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి టీ20 సిరీస్‌ను 3-0తో, వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. తన దూకుడుతో కూడిన ఆటతీరు, కీలక మ్యాచ్‌లలో రాణించే సత్తా ఉన్న ఉమా కాశ్వి నుంచి రాబోయే అండర్-19 వరల్డ్ కప్‌లోనూ టీమిండియా అద్భుతమైన ప్రదర్శన ఆశిస్తోంది. బంగ్లాదేశ్, నేపాల్‌లో గెలుచుకున్న టైటిల్‌ను కాపాడుకునేందుకు బరిలోకి దిగుతున్న భారత జట్టులో ఉమా కాశ్వి ప్రదర్శన అత్యంత కీలకం కానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా

OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా? మున్సిపల్‌ కార్పొరేషన్‌ సీట్ల సర్దుబాటు...

Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..

Anti-SIR Protest: ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్(AISA) అధ్యక్షురాలు నేహా బోరాకు...

Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్‌.. సీన్‌లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?

Off The Record: అంతన్నారింతన్నారు. మీకెందుకు మేం చూసుకుంటామంటూ ముందుకు తోసేశారు....

Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..

Neha Bora:  కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన పిలుపుతో తనకు...