24
October, 2026

A News 365Times Venture

24
Saturday
October, 2026

A News 365Times Venture

Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..

Date:

Neha Bora:  కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన పిలుపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. అక్టోబర్ 16న తనను అదుపులోకి తీసుకున్న తర్వాత రూ. 10 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించి శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశిస్తూ జారీ చేసిన నోటీసులు ఆమె ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. నేహాబోరా తరుఫున న్యాయవాది గోపాల్ శంకర‌నారాయణన్ వాదనలు వినిపించారు. నేహాబోరా ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యల్లో పాల్గొనలేదని ఆయన కోర్టుకు తెలిపారు. హింసను ప్రేరేపించేలా ఆమె ఎలాంటి పిలుపుఇవ్వలేదని వాదించారు.

అక్టోబర్ 16న తిరంగా యాత్ర సమయంలో మండీ హౌజ్ వద్ద నేహా బోరాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు విడుదలైన ఆమెకు అక్టోబర్ 18న ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) నుంచి నోటీసు అందింది. రూ.10 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, శాంతిభద్రతలను కాపాడాలని అందులో ఆదేశించారు. జంతర్ మంతర్‌ను అధికారికి నిరసన స్థలం నుంచి తొలగించినప్పటికీ, ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రజల్ని కన్నాట్‌ప్లేస్ వైపు వెళ్లేలా నేహా బోరా ప్రేరేపించారని నోటీసుల్లో ఆరోపించారు.

అయితే, నేహా బోరాను మండీ హౌజ్ చేరుకున్న 10-15 నిమిషాల్లోపే అదుపులోకి తీసుకున్నారని ఆమె న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ రోజు శాంతిభద్రతలకు భంగం కలిగిచేలా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని వాదించారు. మండీ హౌజ్‌లో కలుద్దామని నేహా బోరా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో, ఎలాంటి హింసకు పిలుపునివ్వలేదని, ప్రజాశాంతికి విఘాతం కలిగించే ఉద్దేశం కనిపించడం లేదని న్యాయవాది పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉన్నాయని, మండీ హౌజ్ ప్రాంతాలు ఆ పరిధిలోకి రావని న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇచ్చిన నోటీసుల్ని రద్దు చేయాలని నేహా బోరా తరుపున కోర్టును కోరారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా

OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా? మున్సిపల్‌ కార్పొరేషన్‌ సీట్ల సర్దుబాటు...

Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..

Anti-SIR Protest: ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్(AISA) అధ్యక్షురాలు నేహా బోరాకు...

Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్‌.. సీన్‌లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?

Off The Record: అంతన్నారింతన్నారు. మీకెందుకు మేం చూసుకుంటామంటూ ముందుకు తోసేశారు....

Uma Kashvi: ఫీల్డింగ్ టైమ్‌లో మైదానంలో కొండముచ్చు హల్చల్.. తరువాత ఏం జరిగిందంటే..?

Uma Kashvi: మహిళల అండర్-19 టీ20 ట్రోఫీ ఎలైట్ క్వార్టర్ ఫైనల్...