24
October, 2026

A News 365Times Venture

24
Saturday
October, 2026

A News 365Times Venture

Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..

Date:

Anti-SIR Protest: ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్(AISA) అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తాకింది. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న నేపథ్యంలో తనకు జారీ చేసిన రూ. 10000 పీస్ బాండ్ నోటీసుల్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆందోళన నేపథ్యంలో న్యూఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(SEM) కోర్టు అక్టోబర్ 17న ఈ నోటీసు జారీ చేసింది. శాంతిభద్రతల్ని కాపాడేందుకు ఒక పూచికత్తుతో పాటు రూ. 10,000 వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశించింది.

అక్టోబర్ 16న, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెహా బోరా వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి తిరంగా మార్చ్ నిర్వహించారు. జంతర్ మంతర్‌ను అధికారికి నిరసన స్థలం నుంచి తొలగించినప్పటికీ, ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రజల్ని కన్నాట్‌ప్లేస్ వైపు వెళ్లేలా నేహా బోరా ప్రేరేపించారని నోటీసుల్లో ఆరోపించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసనలు జరిగాయి.

కోర్టులో వాడీవేడి వాదనలు..

గురువారం ఆమె తన వాదనల్ని హైకోర్టులో వినిపించింది. తాను ఎలాంటి శాంతిభద్రతలకు భంగం కలిగించలేదని, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇచ్చిన పిలుపుతో తనకు సంబంధం లేదని తెలిపింది. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దాఖలు చేసిన నోటీసులు నేహా బోరా 19, 21వ ఆర్టికల్స్ కింద ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా ఉందని ఆమె తరుఫు న్యాయవాది వాదించారు.

ఢిల్లీ పోలీసులు తరుఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ.. నెహా బోరా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తున్న 12 సందర్భాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ చర్యలు శిక్ష విధించేందుకు కాకుండా, ముందస్తు శాంతిభద్రతలను కాపాడేందుకు అని కోర్టుకు తెలియజేశారు. యాక్టివిస్ట్ ప్రశాంత్ భూషన్, సీజేపీ నాయకులు పాల్గొన్న ఓ సమావేశంలో ప్రభుత్వ మార్పుకు పిలుపునిచ్చారని, అందులో నేహా బోరా కూడా ఉన్నారని పోలీసుల తరుఫున న్యాయవాది ఆరోపించారు.

ప్రభుత్వ వాదనలను నేహా బోరా న్యాయవది తోసిపుచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు కోరుకోవడంలో తప్పు లేదని అన్నారు. అయితే, దీనికి ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు ఎన్నికల ద్వారా జరగాలని, ఢిల్లీలో గుంపులుగా చేరి నిరసనలు చేయడం ద్వారా కాదని అన్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా

OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా? మున్సిపల్‌ కార్పొరేషన్‌ సీట్ల సర్దుబాటు...

Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్‌.. సీన్‌లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?

Off The Record: అంతన్నారింతన్నారు. మీకెందుకు మేం చూసుకుంటామంటూ ముందుకు తోసేశారు....

Uma Kashvi: ఫీల్డింగ్ టైమ్‌లో మైదానంలో కొండముచ్చు హల్చల్.. తరువాత ఏం జరిగిందంటే..?

Uma Kashvi: మహిళల అండర్-19 టీ20 ట్రోఫీ ఎలైట్ క్వార్టర్ ఫైనల్...

Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..

Neha Bora:  కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన పిలుపుతో తనకు...