20
November, 2026

A News 365Times Venture

20
Friday
November, 2026

A News 365Times Venture

Ukraine: ‘‘పుతిన్‌ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్‌పింగ్‌లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి

Date:

Ukraine:  చైనాలోని షెంజన్ వేదిక జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్(అపెక్)‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంపై ప్రపంచం ఆసక్తి కనబరుస్తోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌కు సంబంధించిన ఏ అంశంపై చర్చలలోనైనా ఉక్రెయిన్ ఉండటం తప్పనిసరి అని వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ లేకుండా తమపై చర్చించడం ఏంటని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్ధం ముగిసేలా ట్రంప్, జిన్‌పింగ్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సిబిహా మాట్లాడుతూ..పుతిన్‌ను బుజ్జగించడానికి బదులుగా యుద్ధాన్ని ఆపేలా ఆయనపై ట్రంప్, జిన్‌‌పింగ్ ఒత్తిడి తీసుకురావడం మంచిదని అన్నారు. చర్చల నుంచి ఉక్రెయిన్‌ను మినహాయించడం రష్యా దురాక్రమణను మరింత పెంచేలా చేస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే అపెక్ సమావేశంలో పుతిన్, ట్రంప్, జిన్‌పింగ్ ఒకే ఫ్రేములో కనిపించారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

గురువారం రష్యా, యూఎస్, చైనా త్రైపాక్షిక సమావేశంలో ఉక్రెయిన్, యూరప్ దేశాల భాగస్వామ్యం లేకుండానే ఆ మూడు దేశాలు యుద్ధంపై నిర్ణయం తీసుకోవచ్చే ఆందోళనలు ఉన్నాయి. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చైనాలోని షెన్‌జెన్‌కు చేరుకున్నారు. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

ACB Raids: ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా సర్పంచ్.. ఏకంగా రూ.30 లక్షలకు బేరం..

మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన మెరుపు...

Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా భక్తి టీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా...

Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!

Bihar Robbery: బీహార్‌లోని బెతియాలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. బుధవారం...