3
May, 2026

A News 365Times Venture

3
Sunday
May, 2026

A News 365Times Venture

Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్‌తో గొడవ ఏంటి?

Date:

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘కరుప్పు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేస్తూ, ఇందులో త్రిష పోషించిన ‘ప్రీతి’ అనే లాయర్ పాత్రకు సంబంధించిన 37 సెకన్ల నిడివి ఉన్న వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో త్రిష లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా త్రిష వయసు రివర్స్‌లో వెళ్తోందంటూ నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, ఈ ప్రమోషన్ల క్రమంలో త్రిష చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. సినిమాలో తన పాత్ర గురించి త్రిష స్పందిస్తూ.. కనీసం మేకర్స్ ఇప్పుడైనా రిమైండర్ సెట్ చేశారని సెటైరికల్‌గా కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఒక అభిమాని ‘ఆడియో లాంచ్‌కు రాకుండా ఈ కబుర్లు ఏంటి?’ అని ప్రశ్నించగా, త్రిష మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తనకు రావాల్సిన ఆహ్వానం బహుశా మెయిల్‌లో ఎక్కడో పోయి ఉంటుంది అంటూ ఆమె వేసిన కౌంటర్ కోలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఈ వ్యాఖ్యలను బట్టి చిత్ర నిర్మాతలకు, త్రిషకు మధ్య విబేధాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లలో కీలక పాత్ర పోషించాల్సిన హీరోయిన్, ఇలా బహిరంగంగా ఆహ్వానం అందలేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతుండగా, అసలు చిత్ర బృందానికి త్రిషకు మధ్య ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ రిసెప్షన్ శనివారం...

AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..

విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!

తమిళ సినీ పరిశ్రమలో నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, నటీనటుల పారితోషికాలు...

Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ వారు మరోసారి తన...