విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం. 47′. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో అటు ఫ్యాన్స్‌లో, ఇటు సామాన్య ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గతంలో గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి అలాగే.. ఈ సినిమాలో కూడా వెంకటేష్ మార్క్ కామెడీతో పాటు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం,
ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను చిత్ర బృందం విజయవంతంగా పూర్తి చేసింది. అయితే, సినిమాకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన భాగాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా త్రివిక్రమ్ ప్రతి సీన్‌ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. క్లైమాక్స్ పూర్తి కావడంతో త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. దీని బట్టి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్, ప్రమోషన్ల గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.




