30
September, 2026

A News 365Times Venture

30
Wednesday
September, 2026

A News 365Times Venture

Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!

Date:

Thackeray Brothers: ఎన్నికల సంఘం (EC), ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై రాజకీయ ఆందోళన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి రాలేదు. అయినప్పటికీ, సీజేపీ శివాజీ పార్క్‌లోనే ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమైంది. ముంబై పోలీసులు అనుమతి నిరాకరించడంతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ‘‘జైల్ భరో ఆందోళన్’’కు పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే, ఈ సీజేపీ కార్యక్రమానికి శివసేన(యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) పార్టీ చీఫ్ ఠాజ్ ఠాక్రేలు మద్దతు ప్రకటించారు. మద్దతుపై ధన్యవాదాలు తెలిపుతు దీప్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, SIR ప్రక్రియ నిలిపేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఆందోళనలకు ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే మద్దతు తెలిపారు.

శివాజీ పార్క్ వద్ద నిరసనలకు అనుమతి ఇచ్చే అధికారం తమకు లేదని ముంబై పోలీసులు ప్రకటించారు. హైకోర్టు తీర్పులు, అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ.. శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ, సమీప ఆసుపత్రులకు రాకపోకలకు అంతరాయం వంటి కారణం అవుతాయని ప్రస్తావించారు.

ఇదిలా ఉంటే.. రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు అక్టోబర్ 04న ముంబైలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఉమ్మడి నిరసన మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఈ మార్చ్ బైకుల్లా నుంచి సీఎస్ఎంటీ వరకు సాగుతుంది. ఈ మార్చ్‌కు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించనున్నట్లు రాజ్ ఠాక్రే చెప్పారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..

Balochistan: పాకిస్తాన్ సైనికులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) చుక్కలు చూపిస్తోంది....

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు ఊరట కల్గిస్తూ ఉల్లిపాయల ధరల నియంత్రణపై కీలక...

Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..

Ketan Agarwal Case: పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా...

HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..

ఎచ్‌ఎండీ సంస్థ భారత మార్కెట్లో హెచ్‌ఎండీ వైబ్2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను...