30
September, 2026

A News 365Times Venture

30
Wednesday
September, 2026

A News 365Times Venture

Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

Date:

నెల్లూరు జిల్లా రామాపురం గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు సహకారంతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో (2019-24) కేవలం 850 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే నిర్మిస్తే, కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏకంగా 9 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశామని, ఇందులో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే సుమారు 6 వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని వెల్లడించారు.

గతంలో గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కొనే దిక్కులేని దుస్థితి ఉండేదని, నేడు పంచాయతీలే స్వయంగా తమకు అవసరమైన పనులు, ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి ఎదిగాయని అన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 304 మినీ గోకులాలు నిర్మిస్తే, నేడు 30 వేలకు పైగా మినీ గోకులాలు నిర్మించామని, పల్లె పండుగ ద్వారా 13,326 పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రస్తుతం 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం పురోగతిలో ఉందని పేర్కొన్నారు.

ఉదయగిరి ప్రాంతంలో వలసలను తగ్గించేందుకే ఇక్కడ పల్లె పండుగ 3.0ను ప్రారంభించామని, ఉదయగిరి కోటకు చేరుకునే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి కోటను ప్రముఖ టూరిజం హబ్‌‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రాబోయే రెండేళ్లలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.1,30,000 కోట్ల భారీ వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే ప్రజలు నిర్మొహమాటంగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలోని బసోలిలోని CISF క్యాంపులో...

CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!

CJP: కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) ప్రధాన ఎన్నికల...

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ...

OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి

OTR: ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకి పొరుగింటి పుల్లకూర విపరీతంగా నచ్చేస్తోందట. సొంత...