29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్

Date:

OTR: రాష్ట్రం మొత్తం మీద వైసీపీ తీరు ఒకలా ఉంటే… ఉమ్మడి అనంతపురంలో మాత్రం వేరేలా ఉందా? స్థానిక ఎన్నికల ముంగిట్లో సస్పెన్షన్స్‌ భయం పట్టుకుందా? సరికొత్త రాజకీయ సమీకరణలు తెరపైకి వస్తున్నాయా? ఏంటా సమీకరణలు? కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ సైతం కంగారు పడటానికి కారణాలేంటి? అసెంబ్లీ ఎన్నికల డ్యామేజ్‌ నుంచి కోలుకున్న వైసీపీ అధిష్టానం… స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. ఎన్ని స్థానాల్లో గెలుస్తామన్న దానికంటే… ప్రతి చోట పోటీ చేసి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించగలిగితే…. ఆటోమేటిక్‌గా తమ కేడర్‌లో నైతిక స్థైర్యం పెరుగుతుందన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచనగా చెప్పుకుంటున్నారు. ఆ రకంగా రాష్ట్రంలోని పార్టీ నేతలంతా లోకల్‌ బాడీస్‌ ఎలక్షన్స్‌కు సిద్ధమవుతుంటే… అనంతపురం జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పార్టీ కేడర్ నుంచి అధిష్టానానికి ఒకే ఒక నినాదం బలంగా వినిపిస్తోందట. అదే ఘర్ వాపసి. గతంలో సస్పెండ్‌ చేసిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాముల్ని చేయకుంటే… స్థానిక సమరంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ ఉనికికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారట. హిందూపురంలో సస్పెండ్‌ చేసిన సీనియర్ నాయకుడు నవీన్ నిశ్చల్ జనసేన గూటికి చేరారు.

దీంతో… మిగిలిన నియోజకవర్గాల్లోనైనా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ జిల్లా వ్యాప్తంగా ఊపందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఫలితాల తర్వాత కూడా…. ఉమ్మడి అనంతరం జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. క్రమశిక్షణ చర్యల పేరుతో పెనుకొండ, రాప్తాడు, హిందూపురం, కదిరి, రాయదుర్గం వంటి కీలక నియోజకవర్గాల్లో అనేకమంది నియోజకవర్గ, మండల స్థాయి కీలక నేతలపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం. కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని, మరికొందరు పార్టీ లైన్ దాటారని చెబుతూ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, సస్పెండ్ అయిన వారిలో మెజారిటీ నాయకులు ఇప్పటికీ ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉండిపోయారు. కొందరైతే బాహాటంగానే మేం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పారు. అలాంటి వాళ్ళందర్నీ తిరిగి దగ్గరకు తీసుకుంటే… స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందన్నది తాజా లోకల్‌ కేలిక్యులేషన్‌. ఉదాహరణకు నవీన్ నిశ్చల్‌ హిందూపురం వైసీపీలో కీలకమైన నాయకుడు. అయితే తనకు టికెట్ ఇవ్వడంలేదన్న ఉద్దేశంతో గత పదేళ్లుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారాయన. ఆ ఫ్రస్ట్రేషన్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశారన్న ఉద్దేశంతో ఆయన మీద సస్పెన్షన్‌ వేటేశారు.

అది జరిగి 16 నెలలు గడిచినా… అధిష్టానం ఎలాంటి చొరవ తీసుకోకపోవడంతో, ఆయన ఇటీవలే జనసేనలో చేరిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో నవీన్ వంటి నేత పార్టీని వీడటంపై చర్చ జరుగుతోంది. ఈ ఒక్క ఘటనతో జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల కేడర్ అప్రమత్తమైంది. సస్పెన్షన్‌కు గురైన ప్రతి నాయకుడికి ఒక గ్రామంలోనో, లేదా ఒక మండలంలోనో గట్టి పట్టు ఉంది. వారికంటు కొంత ఓటు బ్యాంక్, బలమైన కేడర్ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్‌ చేసేది ఇలాంటి ఓట్‌ బ్యాంకే. వారు గనుక వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసినా లేదా కూటమి పార్టీల్లోకి వెళ్లినా తేడా కొడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీ వర్గాల్లో. ఈ క్రమంలోనే… సాధారణ కార్యకర్తలు, కేడర్ అంతా ఘర్‌వాపసీ స్కీమ్‌ పెట్టమని కోరుకుంటుంటే, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాత్రం భిన్నమైన వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని తిరిగి చేర్చుకుంటే ఎక్కడ పట్టు కోల్పోతామోనన్న భయం కొందరిలో ఉందట. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తున్నట్టు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సాధించాలన్నా, క్యాడర్‌లో ధైర్యం నింపాలన్నా సస్పెన్షన్లను ఎత్తేసి గేట్లు తెరవడం మినహా మరో మార్గం లేదన్నది ఉమ్మడి అనంతపురం వైసీపీ కేడర్‌ వాయిస్‌. దీంతో.. ఫ్యాన్‌ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..

Botsa Satyanarayana: ఇటీవల తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని...

Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ బిలియన్ డేస్...

Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్‌ సీజన్‌-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్‌, సరస్‌ మేళాకు భారీ ఏర్పాట్లు

Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్‌ నగర కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు...

Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..

ఢిల్లీలో శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు, పరిశుభ్రమైన గాలిని అందించేందుకు ఢిల్లీ...