31
October, 2026

A News 365Times Venture

31
Saturday
October, 2026

A News 365Times Venture

Sara Ali Khan: కేదార్‌నాథ్‌ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..

Date:

Sara Ali Khan: బాలీవుడ్ నటి సారా అలీఖాన్ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం, ముస్లిం మతపెద్దలకు నచ్చడం లేదు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముస్లిం మతపెద్ద మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ సారా హిందూ ఆలయాన్ని సందర్శించడాన్ని తప్పుపట్టారు. ఇతర మతాల ఆచారాల్లో పాల్గొనడం షరియత్ ప్రకారం నిషిద్ధమని, సారా చేసిన పని ‘‘పాపం’’అని అన్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. మౌలానా వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక వ్యక్తి విశ్వాసం, ప్రార్థనలు, ఆధ్యాత్మిక ఎంపికలు వ్యక్తిగత స్వేచ్ఛలకు సంబంధించినవని సారాకు మద్దతుగా నిలుస్తున్నారు.

సారా అలీఖాన్ గత వారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. దర్శనం కోసం ఇతర భక్తులతో కలిసి క్యూలో నిలుచుని ప్రార్థనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఆమె చర్యలను తప్పుబట్టారు. సారా కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేయడంపై కొందరు యువ ముస్లింలు తనను ప్రశ్నించారని మౌలానా అన్నారు. ఒక ముస్లిం వ్యక్తి స్వచ్ఛందంగా మరో మతానికి చెందిన ప్రార్థనలు, ఆచారాల్లో పాల్గొంటే అది పాపమని, అల్లాహ్‌ను క్షమాపణ కోరాలని వ్యాఖ్యానించారు.

ముస్లిం స్త్రీ, పురుషులు ఇతర మతాలకు చెందిన విశ్వాసంలో భాగస్వాములు కావడం, ప్రార్థనలు చేయడం, మతపరమైన ఆచారాలు పాటించడం షరియత్ ప్రకారం అనుమతించబడదని పేర్కొన్నారు. సారా ఆలయ దర్శనం కోసం క్యూలో నిలబడటం, పూజలో పాల్గొనడం వంటి చర్యల్ని ‘‘హరామ్’’ అని అన్నారు. సారా పశ్చాత్తాపం వ్యక్తం చేసి, అల్లాహ్‌ను క్షమాపణలు వేడుకోవాలని, అలా చేయకపోతే తీవ్రమైన పాపానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

సారా అలీఖాన్ గత ఆలయ పర్యటనకు కూడా విమర్శలకు గురయ్యాయి. 2021 నవంబర్‌లో కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లిన సమయంలో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. 2023 జూన్‌లో హిందూ ఆలయాన్ని దర్శించుకోవడం తన వ్యక్తిగత ఎంపిక అని ఆమె సమర్థించుకున్నారు. సారా అలీఖాన్‌కు కేదార్‌నాథ్‌తో అనుబంధం ఉంది. ఆమె దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి ‘కేదార్‌నాథ్’ సినిమాలో నటించింది. 2017లో దీని షూటింగ్ ఈ ప్రాంతంలోనే జరిగింది. ఇదే సారాకు తొలి సినిమా.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నాలుగో టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని...

PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..

PM Modi:  ‘‘ నా జీవితంలో చివరి శ్వాస ఉన్నంత వరకు...

SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..

దక్షిణాఫ్రికా మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై 176 పరుగుల భారీ తేడాతో అద్భుత...

Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయంపై భారత...