31
October, 2026

A News 365Times Venture

31
Saturday
October, 2026

A News 365Times Venture

Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..

Date:

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయంపై భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పరాజయం అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. బౌలింగ్‌లో తాము అనుకున్న రీతిలో రాణించలేకపోయామని స్పష్టం చేశాడు. మ్యాచ్ ప్రారంభంలోనే న్యూజిలాండ్ బ్యాటర్లు పవర్ ప్లేలో ఆధిపత్యం చెలాయించి, మంచి రన్ రేట్‌తో ఊపు అందుకని తమపై తీవ్ర ఒత్తిడి పెంచారని తెలిపాడు. ఆ ఊపును అడ్డుకోవడానికి, పరుగుల వేగాన్ని తగ్గించడానికి తాము పలువురు విభిన్న బౌలర్లను రంగంలోకి దింపి ప్రయోగాలు చేసినప్పటికీ అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఒప్పుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో విరుచుకుపడిన న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను శ్రేయస్ అయ్యర్ ప్రత్యేకంగా అభినందించాడు. ఫిలిప్స్ అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడని, అతడి బ్యాటింగ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిందని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లను విశ్లేషించుకుని, ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోవడం తమకు అత్యంత కీలకమని అయ్యర్ అభిప్రాయపడ్డాడు.

అలాగే తదుపరి మ్యాచ్ జరిగే హామిల్టన్ వెళ్లేందుకు మధ్యలో కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తాము త్వరగా వ్యూహాలను సమీక్షించుకోవాల్సి ఉందన్నారు. ఎక్కడ మెరుగైన ప్రదర్శన చేయవచ్చో స్పష్టమైన ప్రణాళికతో తిరిగి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆక్లాండ్ ఈడెన్ పార్క్ మైదానం కొలతలు భిన్నంగా ఉంటాయని, భారత జట్టులోని కొందరు యువ ఆటగాళ్లకు ఇక్కడ ఆడటం ఇదే తొలిసారి కావడంతో ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కాస్త సమయం పడుతుందని చెప్పాడు. బౌలింగ్, ఫీల్డింగ్ ఎగ్జిక్యూషన్‌లో కొన్ని మార్పులు అవసరమని, రాబోయే ఐదో టీ20 మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు బలంగా పుంజుకుంటారనే నమ్మకం తనకు ఉందని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?

Innodata Layoffs:  సాఫ్ట్‌వేర్, ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని...

Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!

Diwali lights safety tips: దీపావళి వచ్చేస్తోంది. చిన్నా పెద్దా అంతా...

Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్

నాలుగో టీ20 మ్యాచ్‌లో సాధించిన భారీ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్...

చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో కలకలం రేగింది. కమ్మెట గ్రామ...