31
October, 2026

A News 365Times Venture

31
Saturday
October, 2026

A News 365Times Venture

PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..

Date:

PM Modi:  ‘‘ నా జీవితంలో చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను’’ అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల పాట్నాలో జరిగిన సమావేశంలో ‘‘మోడీ నాన్న కూడా వెళ్లిపోతారు’’ అని వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని కుటుంబాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు మోడీ కౌంటర్ ఇచ్చారు.

గుజరాత్ బనస్కాంత జిల్లా భిల్డి పట్టణంలో భారత్ బోవైన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం మోదీ సభలో ప్రసంగించారు. ఈ పర్యటనలో భాగంగా సుమారు రూ.14,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.

దేశ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు కొందరు సంతోషిస్తున్నారని మోడీ విమర్శించారు. దేశానికి కష్టం వచ్చిన ప్రతీసారి వారు ఆనందిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమాసియా పరిణామాలో రైతులకు ఎరువులు అందడం లేదని కొందరు ప్రజల్లో భయాందోళనలు సృ‌ష్టిస్తున్నారని ఆరోపించారు. మోడీని అప్రతిష్టపాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, వంటగ్యాస్ దొరకడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత రైతులకు ఎరువుల కొరత రానీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మోడీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువులు ధరలు పెరిగాయని, అయినప్పటికీ భారత రైతులపై భారం పడకుండా ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డీఏపీ బస్తా ధర రూ.5,000 దాటినా, భారత రైతులు దానిని రూ.1,350కే పొందుతున్నారని చెప్పారు. గుజరాత్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడతను కూడా మోదీ విడుదల చేశారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..

దక్షిణాఫ్రికా మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై 176 పరుగుల భారీ తేడాతో అద్భుత...

Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయంపై భారత...

Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?

Innodata Layoffs:  సాఫ్ట్‌వేర్, ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని...

Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!

Diwali lights safety tips: దీపావళి వచ్చేస్తోంది. చిన్నా పెద్దా అంతా...