2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?

Date:

Raptadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన దారుణ ఘటనలో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పాఠశాల ఆవరణలోకి హఠాత్తుగా చొరబడి బాలిక గొంతు, ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసి పరారైన ఆ ఉన్మాది కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు, అతడిని ధర్మవరంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. ఇక.. ఈ పాశవిక ఘటన రాప్తాడు మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. పాఠాలు వింటున్న సమయంలో ఒక్కసారిగా ప్రవేశించిన ఆగంతకుడి దాడిలో తీవ్రంగా గాయపడి, కుడి చేయి తెగిపోయి రక్తపు మడుగులో కుప్పకూలిన అయ్యవారిపల్లెకు చెందిన సదరు విద్యార్థిని ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అత్యవసర విభాగంలో మృత్యువుతో పోరాడుతోంది. వైద్యులు ఆమెను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టి, చివరకు నిందితుడిని ధర్మవరంలో పట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై బాధిత బాలిక కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంపంతో స్కూల్‌లోకి దుండగుడు ప్రవేశించడం ఏంటని బంధువులు నిలదీశారు. మరోవైపు.. క్లాస్ టీచర్ సైతం ఈ ఘటనపై స్పందించారు. “సెకండ్ హవర్ క్లాస్ జరుగుతుండగా దుండగుడు వచ్చాడు.. ఒక్కసారిగా దుండగుడు రావడంతో విద్యార్థులు పరుగులు తీశారు.. దుండగుడు ఒక్కడే వచ్చి ఘాతుకానికి పాల్పడ్డాడు.. బయట ఎంత మంది ఉన్నారో చూడలేదు.. రేపు పోలింగ్ ఉండటంతో మిగతా టీచర్లు ఎవరూ లేరు.. స్కూల్‌లో కేవలం ఐదుగురు టీచర్లు మాత్రమే ఉన్నాం” అని క్లాస్ టీచర్ వివరించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.

Punjab elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)...

Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ సీరియస్

Raptadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ఉన్నత...

Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..

Nvidia: అమెరికా నుంచి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌లను చైనాకు...

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్‌లో మరో కొత్త చర్చ..

భారత జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 87 పరుగుల...