1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..

Date:

Nvidia: అమెరికా నుంచి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌లను చైనాకు అక్రమంగా రవాణా చేస్తున్నారనే అనుమానాలపై దర్యాప్తు మొదలైంది. ఈ వ్యవహారంలో గూఢచర్యం, వాణిజ్య రహస్యాల సేకరణ వంటి నేరాలను అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వార్త ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా(Nvidia)తో ఈ వ్యవహారం ముడిపడి ఉంది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌ సన్నిహితురాలు చైనాకు చెందిన వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌పై అమెరికా దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి.

ఆలిస్ హువాంగ్ ఎవరు..?

ఆలిస్ హువాంగ్ సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ అనే డేటా సెంటర్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఈమె చైనా పౌరురాలు. ఆలిస్ పనిచేసే సంస్థకు ప్రపంచ ఏఐ చిప్ సరఫరా వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయి. చైనా కోసం వాణిజ్య వివరాలను ఈమె సేకరిస్తున్నారనే అనుమాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఎన్విడియా చీఫ్ జెన్సన్ హువాంగ్‌తో ఈమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

ఇదే సమయంలో, ఎన్విడియా చిప్‌లతో పనిచేసే కంప్యూటింగ్ పరికరాలను మెగా స్పీడ్ కొనుగోలు చేస్తోంది. దీని తర్వాత డేటా సెంటర్ సామర్థ్యాలనున ఇతర సంస్థలకు అద్దెకు ఇస్తుంది. చైనా టెక్ దిగ్గజం అలీబాబా కూడా ఈ సంస్థ సర్వీసుల్ని వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆగ్నేయాసియాలో పనిచేస్తున్న సంస్థల ద్వారా అమెరికా విధించిన అధునాతన AI చిప్ ఎగుమతి ఆంక్షలను చైనా కంపెనీలు తప్పించుకున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఆలిస్ హువాంగ్ మెగాస్పీడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. ఈ సంస్థకు ఎన్విడియాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో ఈమెకు సన్నిహిత సంబంధాలు ఏర్పడినట్లు సమచారం.

ఆలిస్‌పై అనుమానం ఎలా వచ్చింది.?

చైనాకు అత్యాధునిక ఎన్విడియా చిప్‌లు చేరుతున్నాయనే ఆందోళనలతో ఆలిస్ హువాంగ్‌పై దర్యాప్తు జరుగుతోంది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా అత్యాధునిక ఏఐ చిప్‌ల ఎగుమతిపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా నేరుగా ఈ టెక్నాలజీ పొందలేని చైనా, ఇతర మార్గాల ద్వారా పొందుతుందా? అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. నిజానికి మెగాస్పీడ్‌పై 2024 నుంచే పరిశీలన ప్రారంభమైంది.

అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ఒక అధికారి మలేషియాలోని మెగాస్పీడ్ డేటా సెంటర్ సందర్శించే సమయంలో ఎన్విడియా పరికరాలు పెట్టెల్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే, అవి అక్కడే ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? మరెక్కడికైనా తరలిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. మెగాస్పీడ్‌కు అనుబంధంగా ఉన్న మలేషియా సంస్థ కొనుగోళ్లపై కూడా దర్యాప్తు సాగింది. 2024 జూన్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్య ఈ సంస్థ అధునాతన ఎన్విడియా చిప్‌లు, సాంకేతికతతో కూడిన కనీసం 4.8 బిలియన్ డాలర్ల విలువైన అధునాతన AI పరికరాలను ఆ సంస్థ కొనుగోలు చేసినట్లు వాణిజ్య రికార్డుల చెబుతున్నాయి. ఈ నెట్వర్క్ ద్వారా చిప్‌లనున చైనాకు మళ్లించి ఉండొచ్చని యూఎస్ అధికారులు అనుమానిస్తున్నారు. 2025లో ఆలిస్ హువాంగ్‌ను సింగపూర్ అధికారులు ప్రశ్నించి వదిలేశారు.

ఎన్విడియా ఎలా స్పందించింది.?

ఆలిస్ హువాంగ్‌తో తమ పరిచయాలు అసాధారణమైనవని లేదా మెగాస్పీడ్‌కు సున్నితమైన కంపెనీ సమాచారం అందించామని వచ్చిన కథనాలను ఎన్విడియా ఖండించింది. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రకటనలో ఎన్విడియా ప్రతినిధి జాన్ రిజ్జో మాట్లాడుతూ.. కస్టమర్లతో సీఈఓ సమావేశాలు నిర్వహించడం సాధారణ బాధ్యతల్లో భాగమనపి చెప్పుకొచ్చారు. ఆలిస్ హువాంగ్‌తో జెన్సన్‌కు ఉన్న సంబంధాలు సాధారనమైవే అని కంపెనీ చెప్పింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్‌లో మరో కొత్త చర్చ..

భారత జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 87 పరుగుల...

Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..

Rajasthan: రాజస్థాన్‌లో ఐఏఎస్-ఐపీఎస్ దంపతుల విల్లాలు, కాటేజీల కొనుగోలు వ్యవహారం సంచలనంగా...

Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న కొన్ని గంటల్లోనే మరింత బలపడి...

Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!

Pune:  మహారాష్ట్ర పూణేలో విషాదం చోటుచేసుకుంది. పింప్రి-చించ్వాడ్‌లోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్...