1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..

Date:

Rajasthan: రాజస్థాన్‌లో ఐఏఎస్-ఐపీఎస్ దంపతుల విల్లాలు, కాటేజీల కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్‌ను ఏపీఓ (అవైటింగ్ పోస్టింగ్ ఆర్డర్స్)లో ఉంచగా, ఇప్పుడు ఆయన భార్య ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రశాఖ మాథూర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈమెను కూడా ఏపీలో కింద ఉంచాలని రాష్ట్ర సిబ్బంది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆస్తుల కొనుగోలు, లీజు ఒప్పందాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.

ఈ కేసులో శిఖర్ అగర్వాల్, ప్రశాఖ మాథూర్‌లు, వీరిద్దరి కుటుంబ సభ్యులు సుమారు రెండేళ్లలో ఉదయ్‌పూర్, అల్వార్ ప్రాంతాల్లో 40 విల్లాలు, కాటేజీలు కొనుగోలు చేశారు. వీటి మొత్తం విలువ రూ. 6.16 కోట్లు(రూ. 61.61 మిలియన్లు) ఉంటుందని తెలుస్తోంది. 2023 సెప్టెంబర్‌లో ఉదయ్‌పూర్ లోని బుజ్రా ప్రాంతంలో ఉన్న అనంత రిసార్ట్‌లో 20 కాలేజీలను ఐఏఎస్-ఐపీఎస్ కుటుంబం కొనగోలు చేసింది. ఆ తర్వాత 2026 మార్చిలో అల్వార్ జిల్లాలో అజబ్‌గఢ్ లో ఉన్న అనంత రిసార్ట్‌లో మరో 20 విల్లాలు కొనుగోలు చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో ప్రాపర్టీలనున గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేశారు.

కొన్న కంపెనీకే మళ్లీ లీజు..

ఈ వ్యవహారంలో ఏ కంపెనీ నుంచైతే వీటిని కొనుగోలు చేశారో, తిరిగి అదే కంపెనీకి లీజు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఉదయ్‌పూర్‌లోని ఒక్కో కాటేజీకి ఏడాదికి రూ.4 లక్షలు, అల్వార్‌లోని ఒక్కో విల్లాకు ఏడాదికి రూ.5 లక్షల లీజు మొత్తాన్ని నిర్ణయించారు. దీని ద్వారా కాటేజీల ద్వారా ఏడాదికి రూ. 80 లక్షలు, విల్లాల ద్వారా రూ. కోటి ఆదాయం వచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మొత్తం 40 ఆస్తుల నుంచి రూ. 1.80 కోట్లు ఏడాది ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

కుటుంబీకుల పేరుతో రిజిస్ట్రేషన్లు..

ఈ ఆస్తుల్ని ఐఏఎష్ అధికారి శిఖర్ అగర్వాల్, ఐపీఎస్ అధికారి ప్రశాఖ మాథుర్, ఆమె తల్లి మంజుల, తండ్రి రఘువంశ్ నారాయణ్ మాథుర్ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రశాఖ మాథుర్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా తన ఇద్దరు కుమారుల పేర్లపైనా ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ కేసులో ఇద్దరు అధికారులు సమర్పించిన స్థిరాస్తి వివరాల ప్రకటన (Immovable Property Returns – IPR) కూడా పరిశీలనలోకి వచ్చింది. ఈ రిపోర్టులో శిఖర్ 2026లో సమర్పించిన ఆస్తుల్లో 14 ప్రాపర్టీల వివరాలు పేర్కొన్నారు. ప్రశాఖ మాథూర్ ఆస్తుల వివరాలు సున్నాగా చూపించినట్లు తెలుస్తోంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న కొన్ని గంటల్లోనే మరింత బలపడి...

Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!

Pune:  మహారాష్ట్ర పూణేలో విషాదం చోటుచేసుకుంది. పింప్రి-చించ్వాడ్‌లోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్...

Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ఓటర్ల జాబితాలో భారీ సంఖ్యలో హిందువుల...

Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..

Omar Abdullah: జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండో వివాహం...