4
October, 2026

A News 365Times Venture

4
Sunday
October, 2026

A News 365Times Venture

Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి

Date:

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు ప్రజల సంస్కృతికి ఎంతో భావోద్వేగమైన అనుబంధం ఉన్న ‘నంది ఫిల్మ్ అవార్డుల’ పండగ మళ్లీ రాబోతోంది. గత ఏడేళ్లుగా (2017-2024) నిలిచిపోయిన ఈ ప్రతిష్టాత్మక అవార్డులను తిరిగి పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో సర్వత్రా సంతోషాన్ని నింపుతోంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. గత నెల (24.09.2026) నిర్మాతల మండలి.. ఏపీ ఎఫ్డీసీ (AP FDC) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ సమర్పించింది. ఆ లేఖలో పేర్కొన్న అభ్యర్థనను ప్రభుత్వం వెంటనే పరిశీలించి, బంగారు నంది, వెండి నంది, కాంస్య నంది (Golden, Silver & Bronze Nandi) అనే మూడు కేటగిరీలలో నంది అవార్డులను పునరుద్ధరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. 1964 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఈ అవార్డుల ద్వారా కళాకారులను, సాంకేతిక నిపుణులను సత్కరించడం అనేది మన సంస్కృతిని గౌరవించడమేనని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పేర్కొంది.

కేవలం నంది అవార్డులే కాకుండా.. 2017-2024 సంవత్సరాలకు గాను ‘ఎన్.టి.ఆర్. జాతీయ ఫిల్మ్ అవార్డు’ను కూడా పునరుద్ధరించడంపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించడం పట్ల కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా.. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కె. దుర్గేష్, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఏపీ రాష్ట్ర ఫిల్మ్, టీవీ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పి. భరత్ భూషణ్, మరియు మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్‌లకు కౌన్సిల్ ప్రెసిడెంట్ సి. కళ్యాణ్, గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, వై.వి.ఎస్. చౌదరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మన సంస్కృతిని గౌరవిస్తే ప్రకృతి రక్షిస్తుందని, అది తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతుందని కౌన్సిల్ అభిప్రాయపడింది. కావున తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రతిభావంతులను, సాంకేతిక నిపుణులను ఇదే విధంగా గౌరవించాలని కూటమి ప్రభుత్వాన్ని వారు అభ్యర్థించారు. మొత్తానికి ఏడేళ్లుగా అటకెక్కిన నంది అవార్డుల సందడి త్వరలోనే మళ్లీ మొదలుకానుండటంతో టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లోని శాసనసభ్యుల్లో 50 శాతం మంది యువతేనని మంత్రి...

UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!

UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్...

Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!

Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా...

CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..

CJP: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా...