4
October, 2026

A News 365Times Venture

4
Sunday
October, 2026

A News 365Times Venture

Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..

Date:

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లోని శాసనసభ్యుల్లో 50 శాతం మంది యువతేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర కేబినెట్‌లో 17 మంది మంత్రులు కొత్తవారని తెలిపారు. ఏపీని ఏ రంగంలో అయినా నంబర్ వన్‌గా నిలపడం తమ విజయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ తన వంతు సహకారం అందిస్తుందని చెప్పారు. రాబోయే పదేళ్లలో భారత్ ఉన్నత స్థాయికి చేరుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ఏపీలో హార్టికల్చర్ నుంచి క్వాంటం వరకు వర్టికల్ ఇండస్ట్రీ క్లస్టర్ల ఏర్పాటు జరుగుతుంది అన్నారు మంత్రి లోకేష్.. ఆక్వాకల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్, కెమికల్స్, ఆటోమొబైల్, సిమెంట్, సోలార్ రంగాల్లో క్లస్టర్ల అభివృద్ధి చేస్తామని తెలిపారు.. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో భారీ క్లస్టర్.. ఐదేళ్లలో 4.82 గిగావాట్ల సామర్థ్యం ఉంటుందని. రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉంది.. నంబర్‌-1 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అని వెల్లడించారు..

కంపెనీలను ఆకర్షించడం కాదు.. పెట్టుబడులను తేవడం..ముందుకు తీసుకు వెళ్లడం..ఏపీ లక్ష్యం అన్నారు లోకేష్.. పరిశ్రమలతో పాటు రీసెర్చ్, ఎడ్యుకేషన్, టెస్టింగ్, ప్రోటోటైపింగ్ ఎకోసిస్టమ్‌పై దృష్టి పెడుతున్నామన్నారు.. ఐఐటీ తిరుపతి, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌తో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయన్నారు. అమరావతిలో పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలను అనుసంధానం చేసే ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తామని.. అమరావతిని ఎక్సలెన్స్‌కు ఐలాండ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.. ఏపీలో అద్భుతమైన శాండ్‌బాక్స్, టెస్ట్‌బెడ్ ఎకోసిస్టమ్.. పరిశోధనలు, ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని. అమరావతి అభివృద్ధిలో ప్రతి 100 రోజులకు మార్పు కనిపించేలా పనుల వేగం చేస్తున్నామన్నారు

పెట్టుబడుల విషయంలో కేవలం ఎంవోయూలు చేసుకోవడమే తమ లక్ష్యం కాదని లోకేష్ స్పష్టం చేశారు. కంపెనీలు వాస్తవంగా ఏర్పాటు చేస్తున్నారా? పెట్టుబడులు పెడుతున్నారా? స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నారా? అనే అంశాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. ప్రతి ప్రమోటర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రతి శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం తానే స్వయంగా పంపుతానని చెప్పారు. తమ పాలసీ ఫ్రేమ్‌వర్క్ కాలానికి ముందుండేలా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 16 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని లోకేష్ తెలిపారు. గతంలో నోటిఫికేషన్లు ఎందుకు ఆగిపోయాయో తెలుసుకునేందుకు ఏఐ ఇంజిన్‌ను అడిగామని చెప్పారు. ఏఐ ద్వారా సమస్యకు పరిష్కారం గుర్తించామని, దీంతో ఎలాంటి తప్పులు లేకుండా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయగలిగామని వివరించారు. ప్రభుత్వ పాలనలో ఏఐ వినియోగం ద్వారా విజిబుల్ గవర్నెన్స్‌తో పాటు ఇన్విజిబుల్ గవర్నెన్స్ కూడా సాధ్యమవుతోందన్నారు.

రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని లోకేష్ వెల్లడించారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. డేటా సెంటర్ పెట్టుబడుల కోసం తొలుత గూగుల్‌తో చర్చలు జరిపామని, అయితే రాష్ట్రంలోని కాంప్లెక్స్ పన్నులకు సంబంధించిన అంశాలను వారు ప్రస్తావించారని చెప్పారు. వెంటనే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి, పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించామని వివరించారు. ‘నమో’ అంటే నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ జోడీగా భావించాలని లోకేష్ అన్నారు. క్వాంటం రంగంలో భారత్ గర్వించే స్థాయిలో ఏపీలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాము కేవలం పెట్టుబడులను ఆకర్షించేందుకు మాత్రమే పనిచేయడం లేదని, పరిశ్రమలకు కొత్త అర్థాన్ని చెప్పే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ప్రయాణంలో ఐఐటీ నిపుణులు కలిసి నడవాలని కోరారు.

ఏపీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దేశం మొత్తం అనుసరించే స్థాయికి తీసుకెళ్లాలని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఏం చేసినా భారత్ దాన్ని ఫాలో అయ్యేలా విధానాలు, ప్రాజెక్టులు ఉండాలని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణం ఇప్పటివరకు చూడని స్థాయిలో జరుగుతోందని పేర్కొన్నారు. అవకాశం ఉన్నప్పుడు అమరావతిని సందర్శించాలని ఐఐటీ నిపుణులు, ఇతరులను కోరారు. ప్రతి 100 రోజులకు అమరావతిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతం అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయికి అనుగుణంగా విస్తరించాల్సిన అవసరం ఉందని లోకేష్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ తరహాలో అమరావతిలో సుమారు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతోందని తెలిపారు. ఇక, క్వాంటం టెక్నాలజీలో విద్య, పరిశోధన, అభివృద్ధి (R&D) రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని సూచించారు. సాంకేతికత, పరిశ్రమలు, పరిశోధన రంగాల్లో ఏపీ వేగంగా ముందుకు సాగాలని అన్నారు. హైదరాబాద్ తరహాలో ఏపీ కూడా త్వరలో ‘ఎస్కేప్ వెలాసిటీ’ సాధించి అద్భుతాలు సృష్టించే స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!

UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్...

Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!

Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా...

CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..

CJP: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా...

CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!

CJP vs Congress: ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల తర్వాత,...