4
October, 2026

A News 365Times Venture

4
Sunday
October, 2026

A News 365Times Venture

CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!

Date:

CJP vs Congress: ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల తర్వాత, సీజేపీ-కాంగ్రెస్ మధ్య వివాదం చెలరేగింది. సీజేపీలోని నేతలు ‘‘లిబరల్ ఎకోసిస్టమ్’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభిజిత్ దీప్కేను లక్ష్యంగా చేసుకుని ఓ వర్గం ప్రచారం చేస్తోందని, సీజేపీ కో కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మండిపడ్డారు. రాంకా ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘‘సెల్ఫ్ డిక్లేర్డ్ లిబరల్ ఎకో సిస్టమ్’’ అభిజీత్ దీప్కేను విమర్శించేందుకు యాక్టివేట్ అయిందని ఆరోపించారు. చాలా కాలం తర్వాత లక్షలాది భారతీయుల ఊహల్ని దీప్కే ఆకర్షించడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ వర్గం ఎక్స్‌లోనే పనిచేస్తూ, తామే ప్రజాస్వామ్యానికి ఏకైక రక్షకులమని భావిస్తోందని విమర్శించారు.

రాంకా వ్యాఖ్యల్ని సౌరవ్ దాస్ సమర్థించారు. బీజేపీకి చెందిన వారు కాకుండా మరో పార్టీకి చెందిన కొందరు ‘‘భారత్, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మాదే’’ అని భావిస్తున్నారని ఆరోపించారు. వారిని సెల్ఫ్ డిక్లేర్డ్ లిబరల్స్, రాజ్యాంగానికి సెల్ఫ్ డిక్లేర్డ్ థేకేదార్లు అంటూ సెటైర్లు వేశారు. ఈ వ్యవస్థ బీజేపీ ఎకోసిస్టమ్ కన్నా తీవ్రంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. డివైడ్ అండ్ రూల్ తరహా రాజకీయాలతో ప్రజల్ని విభజించలేరని అన్నారు.

కాంగ్రెస్ కౌంటర్ అటాక్:

రాంకా, దాస్‌లు తమ వ్యాఖ్యల్లో ఏ పార్టీ పేరును ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఉద్దేశించినవిగా ఉన్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అస్సాం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రీతమ్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. అస్సాంలో సీజేపీ సభ్యుల్ని, అశుతోష్ రాంకాను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలం సహాయం చేశామని అన్నారు. కనీస మర్యాదగా సీజేపీ లీడర్లు కాంగ్రెస్ నేతల్ని కలవలేదని అన్నారు. సీజేపీ అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ రాజకీయంగా ముందుకు తెచ్చే వేదికగా మార్చొద్దని ఆయన అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లోని శాసనసభ్యుల్లో 50 శాతం మంది యువతేనని మంత్రి...

UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!

UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్...

Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!

Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా...

CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..

CJP: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా...