15
November, 2026

A News 365Times Venture

15
Sunday
November, 2026

A News 365Times Venture

OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!

Date:

OTR: ఫస్ట్‌టైం ఎమ్మెల్యేగా గెలిచి చట్ట సభలో అడుగుపెట్టిన ఆ నేత మెల్లిగా రెడ్‌ జోన్‌లోకి వెళ్తున్నారా? అధికార పార్టీ శాసనసభ్యుడు అయి ఉండికూడా… తన పరిధిలోని కీలక స్థానాలను ప్రతిపక్షానికి సమర్పించుకుని ఇరకాటంలో పడ్డారా? మిత్రపక్షం జనసేన కూడా డైరెక్ట్‌గా చంద్రబాబుకే ఫిర్యాదు చేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడాయన ముందున్న అసలు సిసలైన అగ్ని పరీక్ష ఏంటి? తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి 2024 కూటమి వేవ్‌లో చట్టసభ మెట్లెక్కిన కొద్ది మందిలో ఒకరు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ. అధికార పార్టీ ఎమ్మెల్యేగా… మొదట్లో అంతా బాగానే ఉన్నా… క్రమంగా బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే మధ్య గ్యాప్ మొదలైంది. దీంతో లోకల్‌ టీడీపీ… ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గంలో బుసక వ్యవహారం ఇద్దరి అనుచరుల మధ్య కాక రేపింది. అలాగే… మద్యం షాపుల టెండర్ల విషయంలో కూడా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే నడిచిందన్నది బాపట్ల వాయిస్‌. ఎమ్మెల్యే, ఎంపీ మధ్య ఆధిపత్య పోరుతో అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారట.

అయితే నెమ్మదిగా ఎమ్మెల్యే నరేంద్రవర్మ పైచేయి సాధించి నియోజకవర్గంపై పట్టు బిగించారని అంటారు. అదంతా ఒక ఎత్తయితే… ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలు బాపట్లను మరోసారి పొలిటికల్‌ స్క్రీన్‌ మీద హైలైట్‌ చేశాయి. ఈ నియోజకవర్గంలో వచ్చిన ఫలితాలు అధికారపార్టీలో సెగలు పుట్టిస్తున్నాయట. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలున్నాయి. ఎన్నికలకు ముందే పిట్టలవానిపాలెం జెడ్పీటీసీ ఏకగ్రీవమైంది. అయితే… అది కూడా అనుకోకుండా జరిగిపోయిందని అంటారు. ఇక కర్లపాలెంను టీడీపీ కైవసం చేసుకుంది. కానీ… కీలకమైన బాపట్లలో మాత్రం ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బాపట్ల జెడ్పీటీసీగా వైసీపీ తరపున పోటీచేసిన సక్కుబాయి.. టీడీపీ అభ్యర్ది నర్మదపై 1100పైగా మెజార్టీతో విజయం సాధించడం చర్చనీయాంశమైంది. అలాగే.. బాపట్ల మండల పరిషత్ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అందులో వైసీపీ 8 గెలుచుకుంటే టీడీపీ ఏడుతో సరిపెట్టుకుంది.

ఈ లెక్కన అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప బాపట్ల ఎంపీపీ పదవి వైసీపీకి దక్కడం లాంఛనమే. ఇలా.. కీలకమైన నియోజకవర్గ హెడ్‌క్వార్ట్‌లోని జెడ్పీటీసీతోపాటు ఎంపీపీ పదవి ప్రతిపక్షం ఖాతాలో పడుతున్నాయి. వైసీపీ గెలుపుకంటే ఇక్కడ టీడీపీ ఓటమి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పరిషత్ ఎన్నికల్లో ఓటమికి ఎమ్మెల్యే వైఖరే కారణమంటూ టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట. అభ్యర్దుల ఎంపిక సక్రమంగా లేకపోవడంవల్లే ఓడిపోయారన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే నరేంద్రవర్మ పార్టీ క్యాడర్ ను పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే ఎన్నికల్లో పని చేసేందుకు వాళ్ళు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదన్న ప్రచారం ఉంది. ఇక కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేన కూడా ఎమ్మెల్యే వేగేశన తీరుపై గుర్రుగా ఉందట. దీనికి సంబంధించి నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదులు వెళ్ళాయి.

ఇటీవల తుఫాన్‌ బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వచ్చినప్పుడు జనసేన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ లక్ష్మీకళ నేరుగా ఆయనకే ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేశారు. కూటమిగా కలుపుకునిపోవడానికి ఎమ్మెల్యే ఏ మాత్రం సిద్ధంగా లేరని, సెట్‌ చేయమని చెబుతున్న టైంలో వేగేశన కూడా అక్కడే ఉన్నారు. అయితే… ఎమ్మెల్యే జనసేనలో ఒకరిద్దరు నేతలకే ప్రాధాన్యత ఇస్తూ… ఆ పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. దీనికి సంబంధించి ఏకంగా చంద్రబాబుకే జనసేన నేతలు ఫిర్యాదు చేయడం నియోజకవర్గంలో సంచలనమైంది. ఇలా… ఎన్నికల్లో ఓటమి, భాగస్వామ్యపక్షం ఫిర్యాదులు అన్నీ కలగలిసి ప్రస్తుతం నరేంద్రవర్మను రెడ్‌జోన్‌లోకి నెట్టాయని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. ఇప్పుడిక సెకండ్ ఫేజ్‌లో బాపట్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుండటంతో.. ఈసారి ఏదైనా తేడా కొడితే ఎమ్మెల్యే సూప్‌లో పడటం ఖాయమన్న అంచనాలు పెరుగుతున్నాయి.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!

Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాజిరంగ సమీపంలో కంటైనర్...

UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..

UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తాజాగా...

Delimitation Bill: మహిళా కోటా కోసం డీలిమిటేషన్ బిల్లు.. 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం ధీమా!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్ బిల్లు), మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తు...

TG TET: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం...