4
November, 2026

A News 365Times Venture

4
Wednesday
November, 2026

A News 365Times Venture

OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం

Date:

OTR: కమలం పార్టీ తెలంగాణ కదనరంగంలోకి దూకినట్టేనా…? మిషన్‌ తెలంగాణ మొదలైపోయినట్టేనా? ఇంకో రెండేళ్ళలో జరగబోయే యుద్ధానికి డైరెక్ట్‌గా అమిత్‌ షా వచ్చి సమర శంఖం పూరించారా? ఆయన తాజా హైదరాబాద్‌ టూర్‌ గురించి ఉన్న అంచనాలు, విశ్లేషణలేంటి? పార్టీ వర్గాల మాటేంటి? సాధారణంగా… ఒక రాష్ట్రాన్ని తమ రాడార్‌ పరిధిలోకి తీసుకున్నప్పుడు కాషాయ పెద్దల ప్లానింగ్‌ ఎలా ఉంటుంది? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… అధికారం మాదేనన్నది కాషాయ దళం ధీమా. ఆ పార్టీ నాయకుల అంతర్గత చర్చల్లో ఇటీవల ఈ అంశం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారట. మా నెక్స్ట్‌ టార్గెట్‌ తెలంగాణే అంటూ పార్టీ ముఖ్య నేతలు ఆ మధ్య ప్రకటించినా… అడపా దడపా తప్ప… ఆ దిశలో సీరియస్‌ కార్యాచరణ ఇప్పటిదాకా మొదలవలేదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. కానీ… క్రమంగా ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఇటీవలే స్టేట్‌ లీడర్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ధీమాగా చెప్పారాయన.

6 నెలల్లో రాష్ట్ర పార్టీలో విప్లవాత్మక మార్పులు ఉంటాయని కూడా స్పష్టం చేశారు బన్సల్‌. అందులో భాగంగానేనా అన్నట్టు ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయంటున్నారు. బన్సల్‌ చెప్పినట్టుగానే మెల్లిగా తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచుతోంది. నేషనల్‌ కాషాయ లీడర్స్‌ రాష్ట్రానికి వరుసబెడుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు బడా నేతలంతా ఇక మీదట రాష్ట్రానికి రెగ్యులర్‌గా రాబోతున్నారట. ఒక రకంగా చెప్పాలంటే ఇక మీదట రాజకీయ దండయాత్రలు ఉంటాయని అంటున్నారు. పేరు ఏదైనా…. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తాజా టూర్‌ కూడా మిషన్ తెలంగాణలో భాగమే అన్నది పొలిటికల్‌ అనాలసిస్‌. అసెంబ్లీ ఎన్నికల దిశగా రాష్ట్రంలో పార్టీకి ఊపు తీసుకుని వచ్చే కార్యక్రమంలో భాగంగానే… షా.. హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ…. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కావడం, ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ జరిగిన మరుసటి రోజే ఆయన హైదరాబాద్‌లో అడుగుపెట్టడం యాదృచ్చికం కాదని, దీని వెనక గట్టి రాజకీయ వ్యూహం ఉందని చెప్పుకుంటున్నారు.

దీని ద్వారా కాంగ్రెస్‌కు ఆయన సవాల్‌ విసిరారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. ఇక దీపావళి తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ తెలంగాణకు రాబోతున్నారు. కరీంనగర్‌లో జరిగే మహా పాదయాత్రలో పాల్గొంటారాయన. సాధారణంగా బీజేపీ అధిష్టానం ఒక రాష్ట్రం మీద దృష్టి పెట్టిందంటే… రెండేళ్ల ముందే మిషన్ స్టార్ట్ చేస్తుందని అంటారు. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే…తెలంగాణలో కూడా మిషన్‌ స్టార్ట్‌ అయిపోయిందని, గేరు మార్చేందుకే అమిత్ షా ఇక్కడికి వచ్చారన్నది రాజకీయ విశ్లేషణ. ప్రజలకు పార్టీ కేడర్‌కి స్పష్టమైన సంకేతాలు ఇచ్చేందుకే అయన వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అమిత్ షా , మోడీ లాంటి బీజేపీ నేతలు రాష్ట్రాలకు వచ్చారంటేనే ఆ పొలిటికల్ హీట్, కేలిక్యులేషన్స్‌ వేరే లెవెల్‌లో ఉంటాయన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. వీటన్నిటినీ కలిపి చూస్తుంటే… తెలంగాణ పొలిటికల్ పిచ్‌ మీద బీజేపీ బ్యాటింగ్‌ మొదలైనట్టేనన్నది రాజకీయ విస్తృతాభిప్రాయం.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన

AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా,...

Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కేవలం...

Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?

Railway Track Blast:  రాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర భగ్నమైనట్లు తెలుస్తోంది. శ్రీగంగానగర్...

Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!

బియ్యం ధరల్లో అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై తెలంగాణ...