4
November, 2026

A News 365Times Venture

4
Wednesday
November, 2026

A News 365Times Venture

Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?

Date:

Railway Track Blast:  రాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర భగ్నమైనట్లు తెలుస్తోంది. శ్రీగంగానగర్ జిల్లాలో రైలును పేల్చేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అనూప్‌గఢ్‌–సూరత్‌గఢ్‌ రైల్వే మార్గంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రైల్వే పట్టాల కింద ఉన్న రెండు నుంచి మూడు సిమెంట్ స్లీపర్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. అనూప్‌గఢ్ నుంచి బటిండాకు వెళ్తున్న రైలు ఆ ప్రాంతాన్ని దాటిన కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

అనూప్‌గఢ్‌–సూరత్‌గఢ్‌ రైల్వే లైన్‌లోని 50 జీబీ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు సిమెంట్ దిమ్మెల నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. రైల్వే పట్టాలకు బిగించే క్లిప్పులు సైతం విడిపోయాయి. అనూప్‌గఢ్ నుంచి బటిండా వెళ్లే రైలును లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలకు పాల్పడిఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, పేలుడు వెనక కారణాలు, ఇతర వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

సమాచారం తెలియడంతో జిల్లా ఎస్పీ హరిశంకర్ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్‌), ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) బృందాలు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. బాంబ్ స్వ్కాడ్ కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ హరిశంకర్‌ వెల్లడించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!

బియ్యం ధరల్లో అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై తెలంగాణ...

Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!

Imran Khan: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు...

Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..

రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ రైల్వే శాఖ అదిరిపోయే...

Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి.. ఈ...