3
November, 2026

A News 365Times Venture

3
Tuesday
November, 2026

A News 365Times Venture

Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!

Date:

Imran Khan: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్ ‘‘ఇండియాను వదిలి వెళ్లాలి’’ అనే ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం కోర్టు విచారించింది. అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తి దేశ నిరసనల్లో ఎలా పాల్గొంటారు? అని ప్రశ్నించింది. ఇదే అమెరికాలో భారతీయ పౌరుడు పాల్గొంటే వెంటనే విమానంలో దేశానికి తిరిగి పంపిస్తారని వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉంటే, హైకోర్టు ఆగ్రహంతో ఇమ్రాన్ ఖాన్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనబోనని కోర్టుకు హామీ ఇచ్చారు. భారతదేశంపై, రాజ్యాంగంపై ప్రేమ, గౌరవం ఉన్నాయని తన అఫిడవిట్‌లో పేర్కొన్నాను. తాను ఆ రోజు నిరసనల్లో పాల్గొనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లలేదని, కేవలం చూడటానికి వెళ్లానని స్పష్టం చేశారు. సోమవారం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీ. త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేథ్నాలతో కూడిన ధర్మాసనం ముందు ఇమ్రాన్ ఖాన్ తన అఫిడవిట్ సమర్పించారు.

భవిష్యత్తులో తాను ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోనని ఇమ్రాన్ హామీ ఇచ్చారు. నిరసనల్లో పాల్గొనేలా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయడం, ప్రేరేపించడం కూడా చేయనని పేర్కొన్నారు. తాను 42 ఏళ్లలో 40 ఏళ్లు భారత్‌లోనే గడిపానని ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. ఈ దేశ చట్టాలను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, వాటిని అక్షరాలా పాటిస్తానని తెలిపారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..

రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ రైల్వే శాఖ అదిరిపోయే...

Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి.. ఈ...

School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,...

Team India: టీమిండియా జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ..

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్‌కు సంబంధించి భారత సెలక్షన్ కమిటీ...