Nvidia: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారు. వివాహేతర సంబంధాలు, ఆలిస్ హువాంగ్ అనే మహిళ చైనాకు గూఢచర్యం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై విమర్శలు వస్తున్న వేళ రాజీనామా చేశారు. ఎన్విడియా తాత్కాలిక సీఈఓగా కోలెట్ క్రేస్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్విడియా బోర్డ్ డైరెక్టర్లు జెన్సన్ హువాంగ్‌ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆయనే తన పదవికి రాజీనామా చేశారు. బోర్డు సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
ప్రపంచ టెక్ రంగంలో ప్రముఖ ఏఐ చిప్స్ తయారీ సంస్థ ఎన్విడియా వ్యవహారం సంచలనంగా మారింది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్ హువాంగ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. తనకు వేరే మహిళతో ఎఫైర్ ఉన్నట్లు జెన్సన్ ఇటీవల ప్రకటించారు. ఆలిస్ హువాంగ్ కు మెగాస్పీడ్ అనే క్లౌడ్ సర్వీస్ కంపెనీకి ఎన్విడియా చిప్స్ అందించడం, వీటిని ఆమె చైనాకు తరలించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్విడియా చిప్స్‌ను చైనాకు చేరవేసేందుకు ఆలిస్ సహకరించిందనే ఆరోపణలపై అమెరికా, సింగపూర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జెన్సన్‌తో ఉన్న సంబంధాన్ని అడ్డుపెట్టుకుని ఆలిస్ చైనా తరుపున పనిచేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి.




