14
November, 2026

A News 365Times Venture

14
Saturday
November, 2026

A News 365Times Venture

Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..

Date:

తెలంగాణ యువత సివిల్ సర్వీసెస్‌లో అత్యధిక సంఖ్యలో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ సంయుక్తంగా అమలు చేస్తున్న ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం మరోసారి సత్ఫలితాలను అందించింది. ఇటీవల విడుదలైన సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో 31 మంది తెలంగాణ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.

సింగరేణి సంస్థ గత రెండేళ్లుగా తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి ఈ పథకానికి ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ పథకం ద్వారా మొదటి ఏడాది 7 మంది, రెండో ఏడాది 20 మంది చొప్పున ఇప్పటివరకు మొత్తం 27 మంది సివిల్స్‌లో విజయం సాధించారు. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన 158 మంది తెలంగాణ అభ్యర్థులకు రెండు నెలల క్రితం ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.58 కోట్లను సింగరేణి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆ సాయంతో మెయిన్స్‌కు సిద్ధమైన వారిలో 31 మంది తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, వీరికి ఇంటర్వ్యూ సన్నద్ధత కోసం సింగరేణి మరోసారి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనుంది. అంతేకాకుండా, సింగరేణి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వీరికి మాక్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుందని సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి తెలిపారు.

తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మందిలో వరంగల్ జిల్లా నుంచి అత్యధికంగా ఆరుగురు ఉండగా, మేడ్చల్–మల్కాజిగిరి నుంచి నలుగురు, హైదరాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున.. నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. అలాగే ఆదిలాబాద్, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున అర్హత సాధించారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే 18 మంది ఓబీసీ, 8 మంది జనరల్ కేటగిరీ, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు.

తుది ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ఇంటర్వ్యూలోనూ విజయం సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ యువతను అఖిల భారత సర్వీసుల వైపు ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని సింగరేణి స్పష్టం చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Fire Accident: ఫ్యూచర్ సిటీలో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ చైర్ల తయారీ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు..

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని నందిగామ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న...

IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం...

New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతన లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ...

UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!

UP Elections: దేశవ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి...