14
November, 2026

A News 365Times Venture

14
Saturday
November, 2026

A News 365Times Venture

Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!

Date:

Nvidia CEO:  ప్రపంచ టెక్ రంగంలో ప్రముఖ ఏఐ చిప్స్ తయారీ సంస్థ ఎన్విడియా వ్యవహారం సంచలనంగా మారింది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్ హువాంగ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. తనకు వేరే మహిళతో ఎఫైర్ ఉన్నట్లు జెన్సన్ ఇటీవల ప్రకటించారు. మరోవైపు, ఎన్విడియా చిప్స్‌ను చైనాకు చేరవేసేందుకు ఆలిస్ సహకరించిందనే ఆరోపణలపై అమెరికా, సింగపూర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జెన్సన్‌తో ఉన్న సంబంధాన్ని అడ్డుపెట్టుకుని ఆలిస్ చైనా తరుపున పనిచేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, జెన్సన్ హువాంగ్ నాయకత్వంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డులోని సభ్యులు అతడిని నాయకత్వం నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డు మెంబర్లలో భారత సంతతికి చెందిన ఆర్తి షా కూడా ఉన్నారు. ఇప్పుడు జెన్సన్ భవితవ్యాన్ని తేల్చే సభ్యుల్లో భారత సంతతి మహిళ కూడా ఉన్నట్లైంది. 2020 నుంచి ఆర్తి షా ఎన్విడియా బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కంపెనీ బోర్డులో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. విచారణ ఫలితంగా జెన్సన్ హువాంగ్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంటే ఆయన పదవి ఊడుతుంది.

భారత్ నుంచి ఎన్విడియా దాకా ఆర్తి షా ప్రయాణం..

ఆర్తి షా ఎన్విడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యురాలు మరియు కంపెనీకి చెందిన రెండు కీలక కమిటీలలో సభ్యురాలిగా ఉన్నారు. భారత్‌లోని గుజరాత్ యూనివర్సిటీలో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చదువుకున్న ఆర్తీ షా, ఆ తర్వాత ఆమె యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లి, అక్కడ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, రివర్‌సైడ్ నుండి అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రముఖ అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎలీ లిల్లీలో 27 ఏళ్లు పనిచేశారు. ఎలి లిల్లీలో మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆమె కేవలం ఫార్మాకే పరిమితం కాకుండా టెక్నాలజీ , సైబర్‌సెక్యూరిటీ, డేటా సైన్స్, డిజిటల్ హెల్త్, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి రంగాలలో కూడా ముఖ్యమైన పదవులను నిర్వహించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Fire Accident: ఫ్యూచర్ సిటీలో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ చైర్ల తయారీ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు..

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని నందిగామ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న...

IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం...

New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతన లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ...

UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!

UP Elections: దేశవ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి...