18
September, 2026

A News 365Times Venture

18
Friday
September, 2026

A News 365Times Venture

NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Date:

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజునే ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన పొందింది. ఈ ఐపీఓ ప్రారంభమైన రెండు రోజుల్లోనే 100 శాతానికి పైగా భర్తీ అయింది. ప్రస్తుతం ఈ ఐపీఓ మొత్తం 2.04 రెట్లు పైగా సబ్‌స్క్రైబ్ కాగా, రిటైల్ కోటా కూడా పూర్తిగా నిండిపోయింది. దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం వరకు గడువు ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది.

ఈ ఐపీఓలో రిటైల్ కేటగిరీ 1.07 రెట్లు, క్యూఐబీ (QIB) కోటా 3.70 రెట్లు, ఎన్‌ఐఐ (NII) కోటా 2.07 రెట్ల చొప్పున సబ్‌స్క్రిప్షన్ సాధించాయి. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూలో రిటైల్ ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 21 వరకు బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంది. కంపెనీ ఇన్వెస్టర్ల కోసం సెప్టెంబర్ 16నే ఈ ఇష్యూను తెరిచి, ఆ ద్వారా రూ. 6,746.18 కోట్లను సమీకరించింది.

ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించడానికి (IPO) ముందు, ఆ షేర్లకు అనధికారికంగా జరిగే కొనుగోలు, అమ్మకాల మార్కెట్‌ను గ్రే మార్కెట్ అంటారు. ప్రస్తుతం దీనికి గ్రే మార్కెట్‌లో క్షీణత కనిపిస్తుంటంతో ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒక దశలో ఈ ఐపీఓ రూ. 310 వరకు పలికింది. అయితే ప్రైస్ బ్యాండ్ వెల్లడైన తర్వాత ఇది క్రమంగా తగ్గుతూ వచ్చింది. నివేదికల ప్రకారం గురువారం రూ. 142 వద్ద ఉన్న గ్రే మార్కెట్ ప్రైస్, ప్రస్తుతం రూ. 105కి పడిపోయింది.

ఇక ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 1,700 నుంచి రూ. 1,785 మధ్య కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్‌లో 8 షేర్లు ఉండటంతో, ఇన్వెస్టర్లు కనీసం రూ. 14,280 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ప్రతి షేరుపై రూ. 170 రాయితీని ప్రకటించారు. ఈ ఐపీఓ మొత్తం పరిమాణం రూ. 22,561.57 కోట్లుగా ఉంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద వస్తుండగా.. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 12.64 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. ప్రారంభంలో ఈ ఇష్యూ సైజు రూ. 30,000 కోట్లుగా ఉండగా.. దానిని సవరించారు. సోమవారం వరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి తుది ఫలితాలపై మరింత స్పష్టత రానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..

ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత...

Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌‌కే.. లొల్లి తప్పదా?

టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా...

Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

Disha Salian Case:  దిశా సాలియన్ మృతిపై సీబీఐ విచారణ మహారాష్ట్ర...

Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..

ఏపీలో డ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతి, జీవనోపాధుల విస్తరణే ప్రభుత్వ ప్రధాన...