18
September, 2026

A News 365Times Venture

18
Friday
September, 2026

A News 365Times Venture

Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..

Date:

ఏపీలో డ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతి, జీవనోపాధుల విస్తరణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,02,009 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ.15,054 కోట్ల బ్యాంకు రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన రూ.36,000 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా బ్యాంకర్లతో సమన్వయం పెంచుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. స్త్రీనిధి ద్వారా ఇప్పటివరకు 4.73 లక్షల మంది మహిళలకు రూ.4,800 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు.

మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఎస్‌హెచ్‌జీ మహిళకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMJJBY, PMSBY) పథకాల ద్వారా వంద శాతం బీమా రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు. బ్యాంకు రుణాల ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఛార్జీల మినహాయింపుపై మహిళల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మహిళా ఆర్థిక సాధికారతను పెంపొందించే దిశగా వారు తయారు చేసే 65 రకాల నాణ్యమైన ఉత్పత్తుల విక్రయం కోసం ఇప్పటికే నాలుగు ‘స్వయం’ బ్రాండ్ సిగ్నేచర్ స్టోర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జీవనోపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఉపాధి నైపుణ్యాలలో మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో రాణించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే

ప్రస్తుతం దేశంలో యూపీఐ ఛార్జీలపై రగడ నడుస్తోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం...

The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..

నాచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో...

OTR : తాట తీస్తా.. ఎమ్మెల్యే వార్నింగ్! రంపచోడవరం టీడీపీలో కాక!

  రేయ్‌… తాట తీస్తా….! మీరు పిచ్చి వేషాలేస్తుంటే…. నేను చూస్తూ కూర్చోవాలా?...

Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..

భారత యువ సంచలనం అభిషేక్ శర్మ అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20...