15
November, 2026

A News 365Times Venture

15
Sunday
November, 2026

A News 365Times Venture

New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..

Date:

తెలంగాణ రాష్ట్రంలోని ఆటో రిక్షా కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆటో కార్మికుల కోసం ప్రత్యేకంగా ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో ఒక గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ పథకంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోసం సుమారు 2,000 ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఈ ఇళ్ల నిర్మాణాన్ని ‘క్యూర్’ పరిధిలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో, ప్రస్తుతం అమలులో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు-టవర్ల నమూనాకు సమానంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం అమలు కోసం ప్రభుత్వం సుమారు 220 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని ప్రతిపాదించింది. ఇందిరమ్మ ఇళ్లు-టవర్ల పథకానికి వర్తించే నియమ నిబంధనలు, ఆర్థిక సహాయం, రిజర్వేషన్ సదుపాయాలు, లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపు ప్రక్రియలనే ఈ పథకానికి కూడా యథాతథంగా వర్తింపజేయాలని హౌసింగ్ బోర్డుకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఈ పథకంలో కేవలం ఆటో రిక్షా కార్మికులు మాత్రమే లబ్ధిదారులుగా ఉండాలనే ప్రత్యేక నిబంధనను ప్రభుత్వం విధించింది.

ఈ ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం హౌసింగ్ బోర్డును కోరింది. ముందుగా ఆయా నాలుగు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి లభ్యతను పరిశీలించడంతో పాటు, ఆ స్థలాలు ఇళ్ల నిర్మాణానికి ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయో తనిఖీ చేయాలి. అలాగే. నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత, పూర్తిస్థాయి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను, ఆర్థిక ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అద్దె ఇళ్లలో నివసిస్తున్న వేలాది మంది ఆటో కార్మికులకు సొంత ఇంటి భరోసా లభించనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!

Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాజిరంగ సమీపంలో కంటైనర్...

UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..

UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తాజాగా...

Delimitation Bill: మహిళా కోటా కోసం డీలిమిటేషన్ బిల్లు.. 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం ధీమా!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్ బిల్లు), మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తు...

TG TET: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం...