5
November, 2026

A News 365Times Venture

5
Thursday
November, 2026

A News 365Times Venture

KTR: మా ప్రభుత్వం రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం..

Date:

KTR: గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌ను గెలిపించకుండా బీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారని.. హైదరాబాద్ అభివృద్ధి చూసి గెలిపించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓఆర్ఆర్ బయట ప్రజలు కాంగ్రెస్ చెప్పే అబద్ధపు మాటలు నమ్మి వాళ్ళకు ఓటు వేశారన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ వాళ్ళు నోటికి వచ్చిన బంపర్ ఆఫర్‌లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ వాళ్ళు నమ్మలేదు కానీ ఊళ్లలో నమ్మారు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. అడవులను అమ్ముకునే వీరప్పన్‌ను అటవీ శాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటుందో.. భూములు అమ్ముకునే రేవంత్‌రెడ్డిని సీఎం చేస్తే పరిస్థితి అలా అయిపోయిందన్నారు.

“చెల్లని నాణేనికి గీతలు ఎక్కువ.. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ.. కేసీఆర్‌కు జరగరానిది జరగాలని కోరుకుంటున్నారు. మియాపూర్ ప్రభుత్వ భూముల విషయంలో బీఆర్ఎస్ చేసిన పోరాటం వల్లనే కేసు గెలిచాం. మూడేళ్లలో ఒక్క కొత్త ఇల్లు కూడా కట్టలేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ పూర్తిగా తగ్గిపోయింది. ప్లాట్ల విలువ చాలా తగ్గిపోయింది. హైదరాబాద్‌లో కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మియాపూర్ భూములలో తెలంగాణ అమర వీరులకు స్థలాలు ఇవ్వండి. ఎర్రవల్లి ఇస్తాను అంటున్నావు. అంత దూరంలో ఎందుకు.. మియాపూర్‌లో అమర వీరులకు స్థలాలు ఇవ్వండి.. మేము స్వాగతిస్తాం. ఏడాది లోపు కేసీఆర్ మళ్ళీ రాబోతున్నారు. మా ప్రభుత్వం రాగానే రియల్ ఎస్టేట్ కబ్జా దారులకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటాం.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!

Sankranti 2027 Box Office: టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అసలైన...

AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!

AP MPTC and ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ...

IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!

IND vs NZ: ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో...