5
November, 2026

A News 365Times Venture

5
Thursday
November, 2026

A News 365Times Venture

AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!

Date:

AP MPTC and ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మురసు తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎన్నికలు యథావిధిగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కీలక వివరాలు వెల్లడించారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, స్థానిక పరిస్థితులు, మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కలెక్టర్లు సమర్పించే నివేదికల ఆధారంగా అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఈసీ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల కోసం దాదాపు 2.52 లక్షల మంది సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం సుమారు 52 వేల మంది సిబ్బందిని సిద్ధం చేశారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీటీవీ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో 2,051 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,770 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కలిపి మొత్తం 18,843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోనూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ పోలింగ్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!

IND vs NZ: ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో...