5
November, 2026

A News 365Times Venture

5
Thursday
November, 2026

A News 365Times Venture

Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!

Date:

Sankranti 2027 Box Office: టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అసలైన సినిమా పండుగ అంటే సంక్రాంతి సీజన్ అని ఏ మాత్రం ఆలశ్యం లేకుండా చెప్పవచ్చు. అందుకే ఈ సీజన్‌పై కన్నేసే స్టార్ హీరోలు, అగ్ర దర్శక నిర్మాతలు ఏడాది ముందే తమ సినిమాల విడుదల తేదీలపై ఖర్చీఫ్ వేస్తుంటారు. 2027 సంక్రాంతి బరిలో కూడా ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారింది. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి మీడియం రేంజ్ ప్రాజెక్టుల వరకు వరుసగా క్యూ కడుతుండడంతో.. తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి కలిపి దాదాపు రూ.1000 కోట్ల మేర బాక్సాఫీస్ బిజినెస్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సంక్రాంతి బరిలో మెగాస్టార్ సినిమా వస్తుందంటే ఆ హడావిడే వేరు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో చిరంజీవి చేస్తున్న ‘కాకా’ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతికి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన తర్వాతి ప్రాజెక్ట్‌ను జనవరి 12న విడుదల చేసేందుకు ముందే డేట్ లాక్ చేశారు. అయితే ఈ సారి స్టార్ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలు సైతం సంక్రాంతి కలెక్షన్లపై గట్టిగానే దృష్టి సారించారు. సాయి దుర్గతేజ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’ పండుగ రేసులో నిలిచేందుకు సర్వసన్నద్ధమవుతోంది. అటు ‘హనుమాన్’ సినిమాతో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న ‘మహాకాళి’ చిత్రం కూడా ఇదే సీజన్‌ను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.

వీటితో పాటు పూర్తిస్థాయి వినోదాన్ని పంచే చిత్రాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. విభిన్నమైన కాంబినేషన్‌లో దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కలయికలో రూపొందుతున్న ఆసక్తికర చిత్రం ‘జార్జ్ కృష్ణ’ సంక్రాంతి రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక పండుగ వేళ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా.. వినోదాత్మక చిత్రాల స్పెషలిస్ట్ శ్రీవిష్ణు తనదైన మార్క్ ఎంటర్‌టైనర్ ‘ఫ్యామిలీ ప్యాక్’తో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. చూడాలి మరి.. 2027 సంక్రాంతి థియేటర్స్ వద్ద హీరోలెవరో..? జీరోలెవరో..?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!

AP MPTC and ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ...

IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!

IND vs NZ: ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో...