19
July, 2026

A News 365Times Venture

19
Sunday
July, 2026

A News 365Times Venture

Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!

Date:

Karapannam Recipe: రాత్రి మిగిలిన అన్నంతో లేదా అప్పటికప్పుడు వండిన అన్నంతో కూరగాయల అవసరం లేకుండా.. చాలా సులభంగా, రుచిగా చేసుకోగలిగే వంటకం “కారపన్నం”. నోటికి కారంగా, పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు లేదా కూరలు తిని బోర్ కొట్టినప్పుడు ఈ రైస్ పర్ఫెక్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. మరి ఈ వంటకాన్ని ఎలా చేయాలో చూసేద్దామా..

కావలసిన పదార్థాలు:

* అన్నం – 1 కప్పు (మిగిలిన అన్నం లేదా వేడి అన్నం)
* కారం – 1 స్పూన్
* పసుపు – పావు స్పూన్
* ఉప్పు – రుచికి సరిపడా
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర స్పూన్
* కరివేపాకు – తగినంత
* కొత్తిమీర – కొద్దిగా (ఉంటే)
* నూనె – 2 నుండి 3 స్పూన్లు
* పోపు దినుసులు, ఎండుమిర్చి – తగినంత
* పల్లీలు (వేరుశనగ గుళ్ళు) – గుప్పెడు
* ఉల్లిపాయ – 1 (సన్నగా, పొడుగ్గా కట్ చేసినది)
* నిమ్మరసం – అర చెక్క (ఆప్షనల్)

తయారీ విధానం:

ముందుగా ఒక కప్పు అన్నాన్ని పొడిపొడిగా చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ అన్నానికి బాగా పట్టేలా చేత్తో చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని, రెండు లేదా మూడు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించాలి. పోపు వేగుతున్నప్పుడే ఒక గుప్పెడు పల్లీలు వేసి కరకరలాడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలను ఎక్కువగా వేగనివ్వకూడదు. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే రైస్ వేసుకోవాలి. అప్పుడే తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు నాలుకకు తగులుతూ రుచిగా ఉంటాయి.

ఉల్లిపాయలు కాస్త వేగగానే, ముందుగా మసాలాలు కలిపి పెట్టుకున్న అన్నాన్ని పాన్ లో వేసుకోవాలి. స్టవ్ ను సిమ్ లో ఉంచి, పోపు అంతా అన్నానికి బాగా పట్టేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు, కాస్త పుల్లదనం ఇష్టపడేవారు అర చెక్క నిమ్మరసం పిండుకుని కలుపుకోవాలి. అంతే… వేడి వేడి కమ్మని కారపన్నం రెడీ! ఎలాంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈ రైస్ పెద్దలకే కాదు, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్‌పై వేటు!

Rohit Sharma Retirement: భారత క్రికెట్‌లో సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు, యువ...

RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్‌బీఐ.. కఠిన షరతులు..!

RBI Polymer Notes: భారత్‌లో కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు...

The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలకు...

CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్‌.. చర్యలకు ఆదేశాలు..

CM Chandrababu: గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను...