19
July, 2026

A News 365Times Venture

19
Sunday
July, 2026

A News 365Times Venture

RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్‌బీఐ.. కఠిన షరతులు..!

Date:

RBI Polymer Notes: భారత్‌లో కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు ప్రారంభించింది. తొలి దశలో రూ.10, రూ.20 డినామినేషన్ నోట్లను పాలిమర్ మెటీరియల్‌తో ముద్రించే పైలట్ ప్రాజెక్ట్ చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ గ్లోబల్ టెండర్ (Expression of Interest – EOI) జారీ చేసింది.

మొదట పైలట్ ప్రాజెక్ట్.. తర్వాత పూర్తి స్థాయి అమలు

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, తొలుత రూ.10, రూ.20 నోట్లతో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే 2027 నాటికి పెద్ద ఎత్తున పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకురావాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని డినామినేషన్లకు కూడా ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంది.

గ్లోబల్ టెండర్ ఎందుకు?

రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన కరెన్సీ ముద్రణ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ప్రింటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) భద్రతా లక్షణాలతో కూడిన పారదర్శక పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల సరఫరా కోసం ప్రపంచవ్యాప్తంగా తయారీదారులను ఆహ్వానించింది. సుమారు 68,000 రీముల BOPP (Biaxially Oriented Polypropylene) ఆధారిత పాలిమర్ సబ్‌స్ట్రేట్ కొనుగోలు చేయాలని టెండర్‌లో పేర్కొంది. ఇందులో రెండు వేర్వేరు కరెన్సీ డినామినేషన్ల కోసం చెరో 34,000 రీములు కేటాయించనున్నారు. ప్రతి రీములో 500 షీట్లు ఉంటాయి.

ప్లాస్టిక్ నోట్లలో ఉండే భద్రతా ఫీచర్లు

పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే మరింత అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి.
* పారదర్శక విండో (Transparent Window)
* లోహపు అంకెలు (Metallic Features)
* అయస్కాంత భద్రతా దారం (Magnetic Security Thread)
* వాటర్‌మార్క్ తరహా నీడ చిత్రం (Shadow Image)
* ఇరిడెసెంట్ డిజైన్ (Iridescent Pattern)

వంటి ప్రత్యేక భద్రతా అంశాలు ఉండనున్నాయి. వీటి కారణంగా నకిలీ నోట్ల తయారీ మరింత కష్టతరం అవుతుంది.

టెండర్‌లో కఠిన నిబంధనలు

ఈ గ్లోబల్ టెండర్‌లో పాల్గొనే కంపెనీలకు ఆర్‌బీఐ కఠిన అర్హతలు విధించింది. చైనా, పాకిస్తాన్‌లలోని కార్యకలాపాలు భారత ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలని స్పష్టం చేసింది. అలాగే ఆ దేశాల నుంచి ముడి పదార్థాలు సేకరించకూడదని, గతంలో అక్కడ పనిచేసిన సిబ్బందిని ఈ ప్రాజెక్టులో నియమించకూడదని షరతులు విధించింది. భారత్‌తో భూ సరిహద్దు పంచుకునే దేశాలకు చెందిన సంస్థలు పరిశ్రమల ప్రోత్సాహక మరియు అంతర్గత వాణిజ్య శాఖ (DPIIT) రిజిస్ట్రేషన్ కమిటీలో నమోదు అయి ఉండాలి.

ఎవరు టెండర్‌కు అర్హులు?

టెండర్‌లో పాల్గొనే సంస్థలు కనీసం మూడు సంవత్సరాల పాటు సెంట్రల్ బ్యాంకులు లేదా కరెన్సీ ముద్రణ సంస్థలకు పాలిమర్ సబ్‌స్ట్రేట్ సరఫరా చేసిన అనుభవం కలిగి ఉండాలి. అలాగే మొత్తం అవసరంలో కనీసం 30 శాతం అంటే 20,400 రీముల సరఫరా సామర్థ్యం ఉండాలి. అదనంగా, ల్యాబ్ పరీక్షల కోసం పాలిమర్ షీట్ నమూనాలను సమర్పించాలి. వాటిలో జంతువుల కొవ్వు లేదా DNA లేదని ధృవీకరించే సర్టిఫికెట్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి.

ఆర్‌బీఐ గవర్నర్ ఏమన్నారు?

ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల జరిగిన ద్రవ్య విధాన సమీక్ష అనంతరం మాట్లాడుతూ, పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రతిపాదన పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ నోట్ల ప్రయోజనాలు, భద్రత, దీర్ఘకాలిక ఉపయోగం వంటి అంశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రపంచంలో ఎక్కడ మొదలయ్యాయి?

ప్రపంచంలో మొదటిసారిగా 1988లో ఆస్ట్రేలియా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 50కి పైగా దేశాలు ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి, నీటితో త్వరగా పాడవు, నకిలీ చేయడం కష్టమవుతుంది. దీంతో దీర్ఘకాలంలో కరెన్సీ ముద్రణ ఖర్చు కూడా తగ్గుతుంది.

బిడ్లకు గడువు

పాలిమర్ నోట్ల తయారీకి సంబంధించి గ్లోబల్ టెండర్‌లో పాల్గొనే సంస్థలు ఆగస్టు 18లోపు తమ బిడ్లను సమర్పించాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే, భవిష్యత్తులో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు సాధారణ చలామణిలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్‌లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..

Nurse Murder Case: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లోని లోహియా నగర్ పోలీస్...

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్‌లో కీలక పరిణామం..

Delimitation Bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘‘డీలిమిటేషన్’’...

FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!

FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా...