19
July, 2026

A News 365Times Venture

19
Sunday
July, 2026

A News 365Times Venture

The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!

Date:

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో భారీ రికార్డ్స్ సృష్టిస్తుంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది.

తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ నైజాం థియేట్రికల్ హక్కులను మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ రూ.37 కోట్లకు సొంతం చేసుకుంది. నాని కెరీర్‌లో ఇప్పటివరకు ఏ చిత్రానికీ ఈ స్థాయిలో నైజాం బిజినెస్ జరగకపోవడంతో ఇది రికార్డు డీల్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని ఇప్పటివరకు కనిపించని మాస్ అవతార్‌లో ప్రేక్షకులను అలరించనున్నారని చిత్రబృందం చెబుతోంది. నానికి జోడీగా కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ కీలక ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు, ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “ఆయా షేర్” పాట సోషల్ మీడియాలో మోతమోగిపోతుంది. మరోవైపు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

అత్యున్నత నిర్మాణ విలువలు, బలమైన కథ, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ చివరి వారంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే రికార్డు స్థాయి బిజినెస్ చేస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు సినీ పరిశ్రమలో పెరిగిపోయాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్‌లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..

Nurse Murder Case: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లోని లోహియా నగర్ పోలీస్...

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్‌లో కీలక పరిణామం..

Delimitation Bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘‘డీలిమిటేషన్’’...

FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!

FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా...