6
November, 2026

A News 365Times Venture

6
Friday
November, 2026

A News 365Times Venture

IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?

Date:

IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. సీఎస్కేకు చెందిన ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను సన్‌రైజర్స్‌కు బదిలీ చేయగా.. వారి స్థానంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ చెన్నై జట్టులోకి రానున్నారు.

గత వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే తాజా ట్రేడ్‌లో అతడు రూ.6 కోట్ల తగ్గింపు ధరతో సీఎస్కేకు మారనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా యువ సీమర్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ తన ప్రస్తుత ధర అయిన రూ.3 కోట్లకే చెన్నై జట్టులో చేరనున్నాడు. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఖలీల్ అహ్మద్‌ను రూ.4.8 కోట్లకు, నాథన్ ఎల్లిస్‌ను రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది.

2026 వేలంలో జాక్ ఎడ్వర్డ్స్ కోసం సీఎస్కే, సన్‌రైజర్స్ మధ్య పోటీ నెలకొంది. చివరకు హైదరాబాద్ ఫ్రాంచైజీ అతడిని దక్కించుకుంది. అయితే పాదానికి గాయం కావడంతో గత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ వేలంలో కాంట్రాక్ట్ పొందిన అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లలో ఎడ్వర్డ్స్ ఒక్కరే కావడం విశేషం. ఈ ఏడాది ఆస్ట్రేలియా తరఫున వన్డే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తన రెండో వన్డేలోనే ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున కూడా ఆడాడు.

మరోవైపు ఖలీల్ అహ్మద్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జట్టు కాదు. 2018 నుంచి 2021 వరకు ఆ జట్టు తరఫున ఆడాడు. 2026 ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడిన అతడు, తొడ కండరాల గాయంతో సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ జట్టులోకి చేరనున్నాడు. ఇప్పటికే ట్రేడ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన మరో ఎడమచేతి వాటం పేసర్ నటరాజన్‌తో కలిసి బౌలింగ్ చేయనున్నాడు. మరోవైపు నాథన్ ఎల్లిస్ కూడా సన్‌రైజర్స్‌లో చేరనున్నాడు. గత సీజన్‌లో గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన అతడు, సీఎస్కే తరఫున రెండు సీజన్లలో కలిపి కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు.

లియామ్ లివింగ్‌స్టోన్ రాకతో సీఎస్కే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మరో బలమైన ప్రత్యామ్నాయం లభించనుంది. అతడు ఇప్పటివరకు 370 టీ20 మ్యాచ్‌ల్లో 8,595 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్‌తో కలిపి 171 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో గ్లాస్గో కాస్మిక్ తరఫున పది ఇన్నింగ్స్‌ల్లో 219 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2027 వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్, విడుదల జాబితాలను ఖరారు చేసేందుకు జట్లకు ఇచ్చిన గడువును రెండు రోజులు పొడిగించారు. తొలుత నవంబర్ 15గా నిర్ణయించిన గడువును నవంబర్ 17కు మార్చారు. ఇక ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌.. ఎస్‌ఈసీ కీలక ప్రకటన..

AP MPTC, ZPTC Elections: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల...

Minister Uttam Kumar Reddy: బడ్జెట్‌కు మించి నిధులిస్తాం..! భూగర్భజలాల సంరక్షణకు ప్రభుత్వం భరోసా

Minister Uttam Kumar Reddy: రాష్ట్రంలో కరువు ఉపశమన చర్యలు, భూగర్భజలాల...

YS Jagan: ఇవి ఎలక్షన్‌లా.. లేక సెలక్షన్‌లా..? జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం...

YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి,...