6
November, 2026

A News 365Times Venture

6
Friday
November, 2026

A News 365Times Venture

YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!

Date:

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఎన్నికలు నిజంగా ఎన్నికలేనా? అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే తమ పార్టీ కార్యకర్తలను వేలాది మందిని బెదిరించి బైండోవర్ చేశారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ టీడీపీ నాయకులతో కుమ్మక్కై పనిచేసిందని విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, అనేక చోట్ల అడ్డగోలుగా నామినేషన్లను తిరస్కరించారని మండిపడ్డారు.. మరికొన్ని చోట్ల అభ్యర్థులను బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని అన్నారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, రిటర్నింగ్ అధికారులు మాఫియాలా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అక్రమాలను అడ్డుకోవాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కూడా చంద్రబాబుకు తొత్తుగా మారిపోయిందని ఆరోపించారు.

ఎన్నికల సంస్కరణలు ఎందుకు అవసరమో ఈ ఎన్నికలే నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. 17 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ అభ్యర్థులను కనీసం నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. నామినేషన్ల దశలోనే 22 మున్సిపాలిటీల్లో అసలు పోటీ లేకుండా చేశారని, మరికొన్ని ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరినీ పోటీకి దూరం చేశారని అన్నారు. కొంతమంది అభ్యర్థులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసి, చేతులు కట్టేసిన పరిస్థితుల్లో పోటీలోకి దిగేలా చేశారని విమర్శించారు. పులివెందులలో కూడా 20 వార్డుల్లో మాత్రమే తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారని తెలిపారు. పోలింగ్ రోజు కూడా పోలింగ్ కేంద్రాల్లో తమ పార్టీ ఏజెంట్లను కూర్చోనివ్వలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని అన్నారు. తాజాగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగిందని విమర్శించారు. నామినేషన్ల దశలోనే 80 జెడ్పీటీసీ స్థానాల్లో, 2 వేలకు పైగా ఎంపీటీసీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే వాటిని ఎన్నికలు అంటారా? సెలెక్షన్లు అంటారా? అని ప్రశ్నించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అధికారులకు చివాట్లు పెట్టిందని జగన్ గుర్తుచేశారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాలకు గాను 5,737 కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 31,460 పోలింగ్ కేంద్రాల్లో కేవలం 16,464 కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. నామినేషన్ల దశ నుంచి స్క్రూటినీ, పోలింగ్ ప్రక్రియ వరకు అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. రాత్రిపూట బ్యాలెట్ బాక్సుల తరలింపులోనూ రిగ్గింగ్ జరిగిందని, ఈ ప్రక్రియలన్నీ దాటుకుని తమ పార్టీ అభ్యర్థులు ఎక్కడైనా గెలిస్తే అక్కడ కూడా ఫలితాలను తారుమారు చేస్తున్నారని విమర్శించారు. ఇన్ని అక్రమాలు జరిగినప్పటికీ చంద్రబాబు మాత్రం వీటిని తమ ప్రభుత్వ విజయాలుగా చెప్పుకుంటున్నారని జగన్ తీవ్రంగా విమర్శించారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..

Cristiano Ronaldo Retirement: ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు.. కానీ, కొందరే...

Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం

Teacher Dies During Election Duty: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు...

Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం

Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రజారోగ్యాన్ని...