6
November, 2026

A News 365Times Venture

6
Friday
November, 2026

A News 365Times Venture

YS Jagan: ఇవి ఎలక్షన్‌లా.. లేక సెలక్షన్‌లా..? జగన్ సంచలన వ్యాఖ్యలు

Date:

YS Jagan: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను కబ్జా చేసి, అధికార దుర్వినియోగంతో నిర్వహించిన వాటిని నిజమైన ఎన్నికలుగా పరిగణించగలమా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలే మూలస్తంభమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల తీరుపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పూర్వం శకుని మాయా పాచికల గురించి చెప్పుకునేవారని, ఆ పాచికల కారణంగానే కురుక్షేత్ర యుద్ధం జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం అధికార దుర్వినియోగం, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఇవి ఎన్నికలా? సెలెక్షన్లా? అని ప్రశ్నించిన జగన్.. ఈ విధంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాబోయే తరాలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని విమర్శించారు. ప్రజలను నేరుగా ఎన్నికల్లో ఎదుర్కొనే ధైర్యం లేకనే అధికార పార్టీ ఈ తరహా విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రజలకు మాయమాటలు చెప్పి హామీల రూపంలో బాండ్లు ఇచ్చారని జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో చంద్రబాబు పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోందని, తన రాజకీయ భవిష్యత్తుపై భయంతో ఉన్నారని వ్యాఖ్యానించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి,...

Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..

Cristiano Ronaldo Retirement: ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు.. కానీ, కొందరే...

Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం

Teacher Dies During Election Duty: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు...

Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం

Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రజారోగ్యాన్ని...