29
April, 2026

A News 365Times Venture

29
Wednesday
April, 2026

A News 365Times Venture

IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్‌లు.. మారిపోతున్న మ్యాచ్‌ల లెక్కలు..

Date:

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో ఒక ఆశ్చర్యకరమైన ధోరణి కనిపిస్తోంది. భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత పోరాటాలు, చివరి బంతి వరకు సస్పెన్స్ మధ్య మరో అంశం ప్రతి మ్యాచ్‌ను ప్రభావితం చేస్తోంది. అదే క్యాచ్ డ్రాప్‌లు. ఫీల్డర్లు జారవిడుస్తున్న సులభమైన క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ సీజన్‌లో క్యాచ్‌లు వదిలేయడం జట్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక లైఫ్ ఇచ్చిన ఆటగాడు తర్వాత సెంచరీ చేయడం, మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించడం వంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీంతో ఫీల్డింగ్ లోపాలు జట్ల విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి.

కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌కు కారణమైన డ్రాప్ క్యాచ్
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ దీనికి తాజా ఉదాహరణ. ఢిల్లీ జట్టు 264 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇందులో కేఎల్ రాహుల్ 152 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మూడో ఓవర్‌లోనే శశాంక్ సింగ్ సులభమైన క్యాచ్‌ను జారవిడవడంతో రాహుల్‌కు లైఫ్ లభించింది. ఆ తర్వాత అతడు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి భారీ స్కోరు నమోదు చేశాడు.

శ్రేయస్ అయ్యర్ రికార్డు ఛేజ్ వెనుక కూడా అదే కారణం
ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఫీల్డర్లు మాత్రమే కాదు, ఢిల్లీ జట్టు కూడా అనేక క్యాచ్‌లు వదిలేసింది. మొత్తం ఆరు అవకాశాలను జారవిడిచినట్లు సమాచారం. 15వ ఓవర్‌లో కరుణ్ నాయర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడంతో శ్రేయస్ అయ్యర్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును విజయానికి చేర్చాడు.

పడిపోతున్న ఫీల్డింగ్ ప్రమాణాలు
నిపుణుల ప్రకారం ఇది ఒక్కసారిగా వచ్చిన సమస్య కాదు. గణాంకాలు చూస్తే 2020లో ప్రతి 100 క్యాచ్‌లలో 85 క్యాచ్‌లు పట్టేవారు. కానీ 2025 నాటికి ఆ సంఖ్య 76కు పడిపోయింది. ప్రస్తుత సీజన్‌లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఒకే రోజులో 17 క్యాచ్‌లు డ్రాప్
ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్‌ల్లో మొత్తం 17 క్యాచ్‌లు జారవిడవడం ఈ సమస్య తీవ్రతను చూపిస్తోంది. జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో కూడా సులభమైన అవకాశాలు వదిలేయడంతో 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం సాధ్యమైంది.

అలసట, బిజీ షెడ్యూల్ ప్రధాన కారణాలు
మాజీ ఆటగాళ్లు ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తీరికలేని క్రికెట్ క్యాలెండర్‌ను చెబుతున్నారు. ఐసీసీ టోర్నీలు, ఫ్రాంచైజీ లీగ్‌లు, ద్వైపాక్షిక సిరీస్‌ల మధ్య ఆటగాళ్లకు సరైన విశ్రాంతి దొరకడం లేదు. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ ముగియడంతో చాలామంది ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉన్నారని అంటున్నారు.

తీవ్రమైన వేడి కూడా ప్రభావం
దేశంలోని అనేక నగరాల్లో పెరుగుతున్న ఎండలు కూడా ఫీల్డింగ్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఎత్తుగా వచ్చే బంతులను గమనించడం కష్టమవుతోంది. డీహైడ్రేషన్, అలసట, ఏకాగ్రత లోపం కారణంగా తప్పిదాలు పెరుగుతున్నాయి. ఇక, భారత మాజీ ఫీల్డర్ మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ, ఫీల్డింగ్ మెరుగుపరచుకోవాలంటే నిరంతర సాధన అవసరమని అన్నారు. కానీ ప్రస్తుత షెడ్యూల్‌లో ఆటగాళ్లకు అందుకు సమయం దొరకడం లేదని స్పష్టం చేశారు.

చిన్న తప్పిదమే పెద్ద ఫలితం
క్యాచ్ డ్రాప్ అనేది కేవలం ఒక చిన్న తప్పిదంలా కనిపించినా, అది మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తోంది. IPL లాంటి ఒత్తిడితో కూడిన టోర్నీలో ఒక అవకాశం ఇచ్చినా ప్రత్యర్థి దాన్ని భారీగా మలుచుకుంటున్నాడు. అందుకే ఈ సీజన్‌లో క్యాచ్‌లు జారవిడవడం జట్లకు కొంపముంచే సమస్యగా మారింది.. ఎన్నో జట్లకు విజయాన్ని అందించింది.. దీంతో, ప్రత్యర్థి జట్లు చతికిలపడిపోయిన పరిస్థితి..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్‌కు ఆదేశం..

West Bengal polls: పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ జోరుగా...

Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి...

Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక

Chandrababu warning: తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో...

Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఎన్నారై ధర్మేంద్ర...