5
June, 2026

A News 365Times Venture

5
Friday
June, 2026

A News 365Times Venture

India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!

Date:

తాజాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ భవిష్యత్ పాత్రపై కీలక అంచనాలు వెలువడ్డాయి. 2060 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం (PPP) ప్రాతిపదికన ప్రపంచ జీడీపీలో భారత వాటా చైనాను అధిగమించనున్నట్లు ప్రముఖ పరిశోధనా సంస్థ వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ (WIL) నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా ప్రపంచ జీడీపీలో సుమారు 20 శాతం వాటా కలిగి ఉన్నప్పటికీ, జనాభా తగ్గుదల ప్రభావంతో 21వ శతాబ్దం రెండోర్థంలో ఆ దేశ ఆర్థిక ప్రాధాన్యం క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన పరిశోధకులు రూపొందించిన ‘గ్లోబల్ జస్టిస్ రిపోర్ట్: ఏ ప్లాన్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ప్రాస్పెరిటీ విత్ ప్లానెటరీ బౌండరీస్’ నివేదికలో ఈ అంశాలను వెల్లడించారు.

చైనా వాటా తగ్గుదల


నివేదిక ప్రకారం.. 1945లో ప్రపంచ జనాభాలో చైనా వాటా 23 శాతం ఉండగా.. 2025 నాటికి అది 17 శాతానికి పడిపోయింది. 2100 నాటికి ఇది 8 శాతం కంటే తక్కువకు చేరే అవకాశం ఉంది.జనాభా తగ్గుదల కారణంగా చైనా ప్రపంచ జీడీపీలో వాటా మొదట స్థిరపడిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. 2060 ప్రాంతంలో భారత్ దానిని అధిగమించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

భారత్‌కు భారీ అవకాశం


భారత్ జనాభా, వినియోగ మార్కెట్, ఆర్థిక విస్తరణ, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు దీర్ఘకాలంలో దేశానికి అనుకూలంగా మారనున్నాయి. అయితే చైనాతో పోలిస్తే భారత్‌లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, ఉత్పాదకత వృద్ధి మాత్రం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. చైనాలో మానవ వనరుల అభివృద్ధి, విద్య, నైపుణ్యాలపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందిందని విశ్లేషించింది.

21వ శతాబ్దంలో ప్రపంచం ఒకే దేశ ఆధిపత్యంలో కాకుండా బహుళ ధ్రువ (Multipolar) ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నివేదిక అంచనా వేసింది. 1950లలో అమెరికా ప్రపంచ జీడీపీలో 35-40 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయించగా.. 1900-1910 మధ్య యూరప్ వాటా 40-45 శాతం వరకు ఉండేది. అయితే చైనా ఎప్పటికీ ఆ స్థాయి ఆధిపత్యాన్ని సాధించే అవకాశం చాలా తక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.

2026 జీడీపీ అంచనాలు

ప్రపంచ ఆర్థిక దృక్పథం (WEO) తాజా అంచనాల ప్రకారం:

అమెరికా జీడీపీ: 32.38 ట్రిలియన్ డాలర్లు
చైనా జీడీపీ: 20.85 ట్రిలియన్ డాలర్లు
భారత్ జీడీపీ: 4.15 ట్రిలియన్ డాలర్లు
యూకే జీడీపీ: 4.27 ట్రిలియన్ డాలర్లు
జపాన్ జీడీపీ: 4.38 ట్రిలియన్ డాలర్లు

2025లో 3.92 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ, 2026లో 4.15 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు.

PPP అంటే ఏమిటి?

కొనుగోలు శక్తి సమానత్వం (Purchasing Power Parity – PPP) అనేది ఒక దేశ కరెన్సీతో కొనుగోలు చేయగల వస్తువులు, సేవల పరిమాణాన్ని మరో దేశ కరెన్సీతో పోల్చే ప్రమాణం. సాధారణ జీడీపీ కంటే దేశ ప్రజల వాస్తవ కొనుగోలు శక్తిని అంచనా వేయడానికి PPPను ఉపయోగిస్తారు. ఈ ప్రకారంగా భారత్ 2060 నాటికి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగి చైనాను అధిగమించే అవకాశం ఉందన్న ఈ అంచనా దేశ ఆర్థిక భవిష్యత్‌పై ఆశావహ సంకేతాలను ఇస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..

Natural gas: ఇంధన రంగంలో భారత్‌కు ఇది భారీ శుభవార్త. అండమాన్...

Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం

ఆర్ధిక సమస్యలు.. వివాహేతర బంధాలు.. మద్యం.. అదనపు కట్నం.. కారణమేదైనా కావచ్చు…...

Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..

శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడం దాదాపు...

Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..

Sanjay Raut: తృణమూల్ కాంగ్రెస్‌(టీఎంసీ)లో చీలిక, డీఎంకే అసంతృప్తి మధ్య ఉద్ధవ్...