2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..

Date:

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెడ్డన్ పార్క్ వేదికగా జరిగిన ఐదో T20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో అలరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది.

ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్స్ అభిషేక శర్మ ఒక్క పరుగు, సంజు సామ్సన్ 4 పరుగులతో నిరాశపరిశారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ , కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. వీరిద్దరూ కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ స్టేడియం నలుమూలలా భారీ షాట్లు బాదారు.

ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 5  సిక్సర్లతో 61 పరుగులు చేసి అదరగొట్టాడు. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 50 పరుగులు పూర్తి చేసుకుని మెరుపు అర్ధశతకం సాధించాడు. ఈ ఇద్దరి విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

వీరితో పాటు మిడిలార్డర్‌లో నమన్ ధిర్ 33 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. నితీష్ కుమార్ రెడ్డి 22 పరుగులు జోడించారు. చివర్లో కివీస్ బౌలర్లు కట్టడి చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగలిగింది.

న్యూజిలాండ్ బౌలర్లలో ఆదం మిల్నే అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అలాగే నాథన్ స్మిత్, బ్లైర్ టిక్నర్ చెరో రెండు వికెట్లు సాధించారు. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుతో పోరాటం రసవత్తరంగా సాగింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే దిశగా అడుగులు వేసింది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌లు ఈ మ్యాచ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Punjab: పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా!

Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల...

CM Chandrababu: గతంలో ఎన్నడూ లేనంతటి స్ఫూర్తి కనిపిస్తోంది.. స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..

అమరావతి వేదికగా కూటమి పార్టీల ముఖ్యనేతలు, కేడర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

YS Jagan: ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

పులివెందుల నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, పోలింగ్ సరళి తీవ్ర...

Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం...